చిరు విషయంలో వర్మ జంకాడా?

Update: 2015-09-01 14:00 GMT
ట్విట్టర్ లో రాం గోపాల్ వర్మ చేసినన్ని వివాదాస్పదమైన, విషయం ఉన్న ట్వీట్లు ఏ దర్శకుడూ చేసి ఉండరేమో! మనసుకు అనిపించిన ప్రతీ విషయాన్ని ట్విట్టర్ లో పొందుపరచందే నిద్రపోడు వర్మ! అలాంటి వర్మకు టాలీవుడ్ లో ఉన్న శిష్యబృందం పెద్దదే! హీరోలు, దర్శకులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలామందే ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు. వారిలో పూరీ స్థానం ప్రత్యేకం. ఒక్క మాటలో చెప్పాలంటే... వర్మ బెస్ట్ స్టూడేంట్ పూరి! ఈ క్రమంలో పూరీ సినిమాలపై వర్మ నిత్యం ఏదో ఒక ట్వీట్ చేస్తూనే ఉంటాడు.

మొన్నీమద్య పూరీ స్టోరీని నితిన్ వద్దన్నందుకు... ట్విట్టర్ వేదికగా వర్మ ఎక్కిపాడేశాడు. నితిన్ ఇప్పటికే బాగా ముదిరిపోయాడు, ఇక లవ్వర్ బాయ్ వేషాలకి ఏమాత్రం సూట్ కాడని తేల్చేశాడు. ఇదే క్రమంలో పూరీ తయారు చేసిన కథ అద్భుతంగా ఉంది.. ఇంత మంచి కథని నితిన్ చేతులారా పోగొట్టుకున్నాడు.. ఈ కథతో సినిమా చేసిన ఏ హీరో అయినా మంచి ప్రయోజనం పొందుతాడు అని చెప్పాడు! ఇది పూరీ విషయంలో వర్మ అభిమానం తాలూకు రియాక్షనే తప్ప... నితిన్ పై వర్మకు ఏపీ కోపం లేదనే చెప్పాలి!

ఇదే సమయంలో చిరంజీవి 150వ సినిమాకి సంబందించి.. పూరి చెప్పిన కథ ఫస్టాఫ్ బాగానే ఉంది కానీ.. సెకండాఫ్ ఏమాత్రం బాగాలేదని చెప్పేశారు. అప్పటినుండి పూరీ ఆ సినిమా గురించి కానీ.. కథ కరెక్షన్స్ గురించి కానీ ఎక్కడా స్పందించలేదు. సరే పూరీ స్పందించక పోయినా... వర్మ తప్పక స్పందిస్తాడని అంతా భావించారు. కానీ... ఆశ్చర్యంగా వర్మ అస్సలు స్పందించలేదు! ఎందుకో మరి.. పూరీనే వర్మని కంట్రోల్ చేశాడా లేక.. చిరంజీవితో ఎందుకొచ్చిన తంట అని వర్మే జంకాడా అనేది మాత్రం తెలియదు! ఏది ఏమైనా... వర్మ ఇలా ఆలోచిస్తాడని అనుకోలేం! తప్పక స్పందిస్తాడేమో..
Tags:    

Similar News