దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. వర్మను టార్గెట్ చేస్తూ టీడీపీ నేతలు, టీడీపీలో చేరబోయే వారు కూడా మండిపడుతున్నారు. తనను విమర్శిస్తున్న వారికి వర్మకూడా ఘాటుగా సమాధానాలిస్తున్నారు. తాజాగా వర్మ తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా స్క్రిప్ట్ విషయంలో తనకు అన్న ఎన్టీఆర్ సహాయం చేస్తున్నారని చెప్పారు. అన్నగారి ఆత్మ తనను గైడ్ చేస్తోందని వర్మ అన్నారు. ఎన్టీఆర్ తనకు అపారమైన సమాచారాన్ని అందిస్తున్నారని చెప్పారు. ప్రతిరోజూ ఎన్టీఆర్ ఆత్మ తన కలలోకి వస్తోందని, స్క్రిప్ట్ విషయంలో సహకరిస్తోందని చెప్పారు. ఆయన ఆత్మ తనతో మాట్లాడుతోందని, సినిమా ఎలా ఉండాలో సలహాలు, సూచనలు ఇస్తోందని చెప్పారు.
"లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీయడానికి నాకు అపారమయిన బలమిస్తున్న కేవలం ఒకే ఒక శక్తి ఎవరంటే అది ఎన్టీఆర్ అనే వ్యక్తి. ఆ మహానుభావుడి ఆత్మ రోజూ నా కలలోకి వచ్చి నాకు స్క్రీన్ ప్లే రాయడానికి సహకరిస్తోంది" అని పోస్ట్ చేశారు. అయితే, వర్మ సాధారణంగా దేవుళ్లను, ఆత్మలను నమ్మరు. అటువంటి కాన్సెప్ట్ ల మీద నమ్మకం తేని వర్మ ఈ విధమైన కామెంట్స్ చేయడం సోషల్ మీడియాలో పలువురిని విస్మయానికి గురిచేసింది. తన సినిమా కోసం ఇదో తరహా ప్రచార వ్యూహమని పలువురు విమర్శిస్తున్నారు. ఒ పక్క ఎన్టీఆర్..... వర్మ కలలోకి వస్తుంటే...మరోపక్క ఆ పార్టీ వాళ్లకు వర్మ కలలోకి వస్తున్నాడంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.