తెలుగు సినిమా పరిశ్రమ పై ఇప్పుడు నడుస్తున్న డ్రగ్స్ వివాదం రోజు రోజుకూ ముదురుతుంది. ఒక్కొక్క స్టార్ వచ్చి విచారణకు హాజరు అవుతున్నారు. ఈ డ్రగ్స్ ఆరోపణలో ఉన్న నటి ఛార్మి మాత్రం విచారణ చేసే పద్దతి పై హై కోర్ట్ కి ఫిర్యాదు చేసింది. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సబర్వాల్ లా ప్రకారం విచారణ చేయడం లేదు అని అతని కావాలి అనే ఫిల్మ్ ఇండస్ట్రి ని టార్గెట్ చేసి ఇలా చేస్తున్నాడు అని ఛార్మి వాదన. అయితే ఈమె విచారణ అయిపోయిన తరువాత ఛార్మి దైర్యాన్ని మెచ్చుకొంటూ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఒక కామెంట్ చేశాడు. ఛార్మి తన కోసం సినిమా ఇండస్ట్రి గౌరవం కోసం ఝాన్సీ లక్ష్మి భాయ్ లా పొరాడి తన పంతం నెగించుకుంది అని కితాబిచ్చాడు.
అయితే డ్రగ్స్ కేస్ లో నిందితురాలైన నటిని వీరనారి ఝాన్సీ తో పోల్చడం సరికాదు అని కొన్ని పోలిటికల్ గ్రూప్స్ నుండి వ్యతిరేకత వచ్చింది ముఖ్యంగా బిజేపి వర్గాలు నుండి. దానికి మన డైరెక్టర్ వర్మ వివరణ చూడండి “నేను అన్నదాంట్లో తప్పేముంది? ఆ కాలం లో దేశభక్తి - జాతీయత అనే భావాలు లేవు. ఆమె తన ప్రజలు కోసం రాజ్యం కోసం యుద్దం చేసింది. ఇప్పుడు ఛార్మి కూడా తన పరువు కోసం సంఘంలో గౌరవం కోసం ఇక్కడ గవర్నమెంట్ తో పోరాడింది అంతే'' అన్నాడు. ''ఇది నా వ్యక్తిగత అభిప్రాయం దీనికి రాజకీయం ముడిపెట్టి అనవసర రచ్చ చేయకండి'' అని చురకేశాడు కూడా.
అంతే కాకుండా సినిమా ఇండస్ట్రి మాత్రమే డ్రగ్స్ మాఫియా కి కారణం అన్నంతగా ఇన్వెస్టిగెట్ ఎందుకు జరుపుతున్నారో తెలియటం లేదు. సిట్ అధికారులు ఆ 12 మంది స్టార్లు ఏమి అన్నారో కాస్తా బయటపెడితే బాగుంటుంది అని అభిప్రాయపడుతున్నాడు వర్మ. లేదా ఇండస్ట్రిలో ఇంకా పెద్ద బాబులు ఉన్నారు అనే సూచనలు మీడియాకు ఇవ్వడమైన మానుకోండి అని అన్నాడు. ఏదైనా వర్మ కు సిట్ వాళ్ళు విచారణ చేసే పద్దతి బొత్తిగా నచ్చలేదు అనట్లు కనిపిస్తుంది.