ఊహించని ఈ పరిణామం కేవలం యాదృశ్చికమని చెప్పక తప్పదు. కొన్ని గంటల తేడాతో ఒక నిర్మాతపై సినిమా రంగానికి చెందిన వేర్వేరు వ్యక్తులు ఇద్దరు తీవ్రస్థాయిలో విరుచుకుపడటం.. ఎప్పుడూ వినని రీతిలో ఆరోపణలు.. విమర్శలు చేసుకోవటం చాలామందికి కొత్త అనుభవంగా చెప్పాలి. ఆ మధ్యన ఇచ్చిన ఒక ప్రైవేటు ఇంటర్వ్యూలో నిర్మాత బండ్ల గణేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పనిలో పనిగా హీరో సచిన్ జోషిపైనా తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. దీనికి కౌంటర్ గా నిన్న ఒక కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో సచిన్ జోషి చెలరేగిపోయారు. బండ్ల మీద తీవ్ర ఆరోపణలు చేయటంతో పాటు.. అతడిపై తాను పెట్టిన కేసుల లెక్క చెప్పటమే కాదు.. బండ్ల తనకున్న అప్పుకు సంబంధించిన నోట్లను చూపించాడు. వన్ సైడెడ్ గా వార్తలు రాయకూడదని.. ఆరోపణలు వచ్చినప్పుడు.. వివరణ అడిగి రాయాలన్న విషయాన్ని సైతం మర్చిపోతారా? అంటూ కాస్త నెమ్మదిగానే మీడియాను అనాల్సిన మాటను అనేశాడు.
ఇదిలా ఉంటే.. బండ్ల మీద తాజాగా వివాదాస్పద దర్శకుడు.. సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ అయిన వర్మ ఘాటుగా విరుచుకుపడ్డారు. ఆ మధ్యన పవన్ కల్యాణ్ మీద వర్మ చేసిన ట్వీట్లపై బండ్ల ఆగ్రెసివ్ గా రియాక్ట్ అయి.. వర్మను ఓ మొరిగే కుక్కగా అభివర్ణించి.. పవన్ చెప్పు స్థాయి కూడా చేయవంటూ విరుచుకుపడ్డారు. ఆ ట్వీట్ కు కౌంటర్ ఇచ్చిన వర్మ.. అగ్గి ఫైర్ అయ్యాడు. కాకుంటే ఎక్కడా బండ్ల పేరును ప్రస్తావించకపోవటం గమనార్హం.
తనను వీధి కుక్కగా అభివర్ణించిన బండ్ల గణేష్ ను.. మూతులు నాకు కుక్కగా అభివర్ణించాడు. మొరిగే కుక్కలు చాలా బెటర్ అని.. అవి తమ పని తాము చేస్తాయని.. మొరిగే కుక్కలకు కుక్కల్లా ఎలా కరవాలో తెలుసని.. కానీ మూతులు నాకే కుక్కలు ఎలుకలు కంటే అధ్వానం అంటూ విరుచుకుపడ్డారు. ఎవరినైనా సూటిగా చెప్పేసే వర్మ.. బండ్ల పేరును తిట్టకుండా.. అతనన్న మాటల్ని మాత్రమే రిటార్ట్ ఇవ్వటం గమనార్హం. ఇష్టారాజ్యంగా కుక్కలతో పోల్చుకుంటూ తిట్టుకుంటున్న ఈ తిట్ల భాగోతం ఎక్కడి వరకూ వెళుతుందన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/