అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టూర్ సందర్భంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వేసిన ట్వీట్ సెటైర్లు దీపావళి టపాసుల్లా పేలిన సంగతి తెలిసిందే. భారత్ లో ట్రంప్ అడుగుపెట్టింది మొదలు....వర్మ ట్రంప్ ను ఓ ఆట ఆడుకున్నాడు. అహ్మదాబాద్ లో మురికివాడలు కనబడకుండా కట్టిన గోడను ట్రంప్ వ్యూతో చూడాలని సెటైర్ వేసిన వర్మ.....భారత్ లో కాబట్టి ట్రంప్ టూర్ కోసం ఇంత ఖర్చుపెట్టారని...అదే మోడీ పర్యటనకైతే అమెరికన్లు అంత ఖర్చుపెట్టరని...అంత హైరానా పడరని తేల్చేశాడు. ఇక, తనను చూసేందుకు 70లక్షల మంది వస్తారని మోడీ చెప్పారని ట్రంప్ అనడంపై వర్మ సెటైర్ వేశాడు. ఒక వేళ అంతమంది రాకుంటే ట్రంప్ లెక్క అడుగుతాడంటూ చమత్కరించాడు. తాజాగా, ఆ లెక్కను సరిచేస్తూ వర్మ మరో ట్వీట్ చేశాడు. ఒక డాలర్ 70 రూపాయలతో సమానం కాబట్టి....ఒక గుజరాతీ 70 మంది అమెరికన్లతో సమానమంటూ వర్మ చేసిన ట్వీట్ వైరల్ అయింది.
ట్రంప్ నకు స్వాగతం పలికేందుకు సుమారుగా లక్షమంది వచ్చినట్టు అంచనా. అయితే, తనను చూసేందుకు 70లక్షల మంది వస్తారని మోడీ చెప్పారని ట్రంప్ అన్నారు. దీనికి వర్మ...ఒక వేళ మోడీ చెప్పినట్లు 70 లక్షల మంది రాకుంటే...ట్రంప్ లెక్క అడుగుతారని - అసలే ట్రంప్ నకు ప్రతీకార ధోరణి ఎక్కువని సెటైర్ వేశాడు. దానికి కొనసాగింపుగా తాజాగా వర్మ మరో సెటైర్ వేశాడు. తన టూర్ కు 70లక్షల మంది రాలేదని...కేవలం లక్షమంది మాత్రమే వచ్చారని మోడీని ట్రంప్ ప్రశ్నించారట. ఒక అమెరికన్ డాలర్ 70 రూపాయలతో సమానమని...అలాగే ఒక గుజరాతీ 70 మంది అమెరికన్లతో సమానమని మోడీ జవాబిచ్చారట. ఇప్పటికే ఈ లక్షమంది జనంపై అమెరికన్ మీడియా కూడా సెటైర్లు వేస్తోంది....వారిని మన వర్మ కొత్త థీయరీ ట్వీట్ కన్విన్స్ చేస్తుందేమో చూడాలి మరి.