పెద్ద నోట్ల రద్దు వ్యవహారం ప్రతీ ఒక్కళ్లపై ఎఫెక్ట్ చూపించింది. దీన్ని సపోర్ట్ చేసేవారికి సమానంగా.. ఆ మాటకొస్తే వ్యతిరేకిస్తున్నా వారే ఎక్కువగా ఉన్నారు. తమ సొమ్మును బ్యాంకులు-ఏటీఎంల ముందు బారులు తీరి తీసుకోవడాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటివారికి పంచ్ డైలాగ్స్ తో కౌంటర్స్ వేస్తున్నారు సెలబ్రిటీలు.
పూరీ జగన్నాధ్ తన ట్రేడ్ మార్క్ డైలాగ్ తో ఒక పంచ్ వేస్తే.. వీరేంద్ర సెహ్వాగ్.. హరీష్ శంకర్ లు ఇప్పటికే అద్దె పంచ్ లతో అయినా ఆకట్టుకున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి రామ్ గోపాల్ వర్మ కూడా చేరిపోయాడు. బ్యాంకులు దగ్గర బారులు తీరడంపై విమర్శలు చేస్తున్నవారిపై తాజాగా వర్మ ఓ పంచ్ డైలాగ్ పోస్ట్ చేశాడు. 'నా దగ్గర బ్లాక్ మనీ లేదు.. నేనెందుకు ఏటీఎంలు.. బ్యాంకుల దగ్గర క్యూలో నుంచుని ఇబ్బంది పడాలి' కామన్ మ్యాన్ క్వశ్చన్ చేస్తే.. 'నాకు పాకిస్తాన్ ఏమీ పర్సనల్ గా శతృత్వం లేదు.. మరి నేనెందుకు నీకోసం బుల్లెట్ దెబ్బలు తినాలి' అని సైనికుడు నిలదీస్తాడు.
ఒక రకంగా చెప్పాలంటే.. మోడీ చేసిన పనికి వర్మ ఫుల్ సపోర్ట్ ప్రకటించడమే ఇది. చిన్నా చితకా ఇబ్బందులను పట్టించుకోవద్దంటూ ఇలా చెప్పాడు వర్మ.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/