బాలయ్యకు నేనేం వ్యతిరేకం కాదు

Update: 2018-11-27 06:06 GMT
నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా క్రిష్‌ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్‌’ మూవీ రెండు పార్ట్‌ లుగా తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. ఎలాంటి వివాదాస్పద అంశాలు లేకుండా క్లీన్‌ చీట్‌ తో వివాదాలకు పూర్తి దూరంగా ఈ చిత్రాన్ని దర్శకుడు క్రిష్‌ తెరకెక్కిస్తున్నాడు. సంక్రాంతికి మొదటి పార్ట్‌, రిపబ్లిక్‌ డే కు రెండవ పార్ట్‌ విడుదలకు సిద్దం చేస్తున్నాడు. ఈ సమయంలోనే వర్మ పూర్తి వివాదాస్పద అంశాలతో ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే రిపబ్లిక్‌ డే సందర్బంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తానంటూ ప్రకటించాడు. ‘ఎన్టీఆర్‌ మహానాయకుడు’ చిత్రానికి పోటీగా రాబోతున్న ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రం పై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

తాజాగా వర్మ నిర్మాణంలో తెరకెక్కిన ‘భైరవ గీత’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘ఎన్టీఆర్‌’ ను టార్గెట్‌ చేసి లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ను తెరకెక్కిస్తున్నట్లుగా వస్తున్న వార్తలను కొట్టి పారేశాడు. తన అభిమాన నాయకుడి గురించి తెలియజేయాలనే ఉద్దేశ్యంతో నేను ఈ చిత్రాన్ని చేస్తున్నాను తప్ప, నేనేం బాలకృష్ణకు వ్యతిరేకంగా వెళ్లడం లేదు, నందమూరి అభిమానుల మనోభావాలను దెబ్బ తీయబోవడం లేదని వర్మ పేర్కొన్నాడు.

వర్మ పైకి అలా చెబుతున్నా కూడా ఖచ్చితంగా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ మూవీ అనేది ‘ఎన్టీఆర్‌’ చిత్రాన్ని టార్గెట్‌ చేసి చేస్తున్నాడని, పోటీగా ‘ఎన్టీఆర్‌ మహానాయకుడు’ విడుదల కాబోతున్న రోజే తన లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ను కూడా విడుదల చేయబోతున్నాడనే టాక్‌ వినిపిస్తోంది. మొదట ఎన్టీఆర్‌ చిత్రంలో చూపించని విషయాలను తాను చూపిస్తానంటూ ప్రకటించిన వర్మ ఇప్పుడు మాత్రం ఆ సినిమాకు పోటీ కాదని - బాయ్యకు నేనేం వ్యతిరేకిని కాదంటూ చెబుతున్నాడు. వర్మ తన సినిమా విడుదల సమయంలో మరెంతగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సినిమాకు హైప్‌ క్రియేట్‌ చేస్తాడో చూడాలి.

Tags:    

Similar News