ఇప్పటిదాకా మనకు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ మాత్రమే తెలుసు. అది కూడా భారత జాతిపితగా, మహాత్మా గాంధీగా తన జీవితాన్ని దేశ సంకెళ్లను తెంచేందుకు అంకితం చేసిన కారణంగానే మనకు కరంచంద్ గాంధీని మనం మరిచిపోలేకపోతున్నాం. అందుకే ఏటా ఆయనకు జయంతితో పాటు వర్ధంతి కూడా నిర్వహిస్తున్నాం. బుధవారం గాంధీ జన్మించి 150 ఏళ్లు అయిన నేపథ్యంలో గాందీజీ 150వ జయంతిని ఘనంగా జరుపుకున్నాం. ఈ క్రమంలో గాంధీకి సంబందించి మనకు బుధవారం మరిచిపోలేని రోజే. ఈ రోజే గాంధీ స్వతంత్య్రపోరాటం, ఆయన వ్యక్తిత్వం, సమాజం కోసం ఆయన చేసిన సేవలను స్మరించుకుంటున్న సమయంలో ఆయన అసలు పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ పేరును మరోమారు స్మరించుకుంటున్నాం.
ఇలాంటి క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఆ పేరును పోలిన గోపాల్ దాస్ వర్మాచంద్ రాంధీ పేరు ఎంట్రీ ఇచ్చేసి షాకిచ్చేసింది. అయినా... మనకు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ తెలుసు గానీ... ఎప్పుడూ వినని ఈ గోపాల్ దాస్ వర్మాచంద్ రాంధీ తెలియదు కదా. అసలు ఈ వర్మాచంద్ రాంధీ ఎవరు?. ఇంకెవరండీ బాబు వివాదాలకే కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన రాంగోపాల్ వర్మనే. సినీ దర్శకుడిగా, ఇటీవలే రాజకీయ సినిమాలను నెత్తికెత్తుకున్న వర్మ.... తనను తాను గోపాల్ దాస్ వర్మాచంద్ రాంధీగా అభివర్ణించుకున్నారు. అది కూడా గాంధీజీ 150వ జయంతి రోజునే ఆయన ఈ తరహా పేరును పెట్టుకోవడం నిజంగానే ఆశ్చర్యంగానే ఉందని చెప్పక తప్పదు. ఒక్క పేరులోనే కాదు ఇంకో విషయంలో తాను మహాత్ముడి కంటే కూడా తానే గొప్పోడినని కూడా వర్మ చెప్పుకున్నాడు. మహాత్ముడు దేశ స్వాతంత్య్రం కోసం పాటు పడితే.. తాను మహిళల అభ్యున్నతికి పాటుపడిన వాడినని కూడా వర్మ చెప్పుకున్నారు. వర్మ ట్విట్టర్ ఖాతాలో బుధవారం ఎంట్రీ ఇచ్చిన ఈ ట్వీట్ నిజంగానే ఇప్పుడు తెగ వైరల్ గా మారిపోయింది.
వర్మ తన ట్వీట్ లో ఏమని చెప్పుకున్నారన్న విషయానికి వస్తే... ‘బ్రిటిష్ పాలనలో భారతీయుల బానిసత్వం పోవడానికి పోరాడి భారతీయ పాలన రాబట్టి స్వాతంత్య్రం తెచ్చి పెట్టారు అలనాటి గాంధీ మరియు సమరయోదులు కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే స్త్రీ బానిసత్వం పోవడానికి వాళ్ల విలువల కోసం నిరంతరం కృషి చేస్తున్నవాడు ఒక రాంగోపాల్ వర్మ మాత్రమే‘ అని సదరు ట్వీట్ లో వర్మ చెప్పుకున్నారు. ఈ ట్వీట్ ను చూస్తుంటే... అందులోని కంటెంట్ చూస్తుంటే... వర్మ తనకు తానుగా స్వయంగా ఈ ట్వీట్ పోస్టు పెట్టినట్టుగా అనిపంచడం లేదన్న వాదన వినిపిస్తోంది. వర్మ ముదునూరి అనే పేరిట ఎవరో పెట్టిన పోస్ట్ ను వర్మ ట్యాగ్ చేయడంతో పాటుగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసినట్టుగా అనిపిస్తోంది. ఏది ఏమైనా తనను తాను మహాత్ముడి కంటే గొప్పగా.. మహిళల కోసం పోరాడిన వాడిగా అభివర్ణించుకోవడం నిజంగానే ఆసక్తికరమేనని చెప్పక తప్పదు.