స్టార్ డైరెక్టర్లు భారీ స్థాయిలో చేసిన సినిమాలకే థియేటర్లలకు జనాలు రాని పరిస్థితి. బాగుందన్న టాక్ వస్తే తప్ప పేరున్న డైరెక్టర్ చేసిన సినిమా అయినా సరే ఆడియన్స్ లైట్ తీసుకుంటున్నారు. అలాంటిది అవుడేటెడ్ డైరెక్టర్ల మూవీస్ కోసం థియేటర్లకు జనం వస్తారంటే అది కలే అవుతుంది.
ఒకప్పుడు `శివ`తోట్రెండ్ సెట్టర్ గా నిలిచిన రామ్ గోపాల్ వర్మ ఇప్పడు అలాంటి కలల్లో విహరిస్తూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలని పూర్తి చేస్తూ థియేటర్లలోకి వదులుతున్నాడు. జనం పట్టించుకోవడం మానేసినా తన ప్రయత్నం మాత్రం ఆపడం లేదు. సగటు ప్రేక్షకుడు ఇంకా ఆపు మహా ప్రభో అని కామెంట్ లు చేస్తున్నా అపర గజినీ లా బాక్సాఫీస్ మీద దాడి చేస్తూనే వున్నాడు.
శివ, సర్కార్, సత్య, రంగీలా వంటి క్లాసిక్ సినిమాలని అందించిన వర్మ ఇప్పడు తన పట్టుని కోల్పోయి మూస టేకింగ్ తో అర్థం పర్థం లేని కథలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తున్నాడు. ప్రేక్షకుల కోసం తాను సినిమాలు చేయడం లేదని అంటూనే వరుస సినిమాలు చేస్తున్నాడు. ఈ మధ్య వర్మ చేసిన `కొండా` సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్లిందో తెలియకుండానే థియేటర్ల కు బైబై చెప్పేసింది.
కొండా మురళి జీవిత కథ అంటూ ఓల్డ్ ఫార్ములాతో `కొండా`మూవీని చుట్టేసి వదిలాడు వర్మ.. జనం కూడా అంతే ఫాస్ట్ గా ఆ మూవీని రిజెక్ట్ చేశారు. దీని తరువాత వర్మ వదిలిన మరో సినిమా `లడ్కీ`. తెలుగులో `అమ్మాయి`గా జూలై 14న భారీ స్థాయిలో విడుదల చేశారు. బ్రూస్ లీ స్ఫూర్తితో మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో అత్యంత భారీ స్థాయిలో రూపొందిన ఈ మూవీని చైనాలో 40 వేల స్క్రీన్ లలో రిలీజ్ చేస్తున్నామంటూ జోరుగా ప్రచారం చేశారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వర్మ ఇది సీరియస్ సినిమా అంటూ టెన్షన్ టెన్షన్ గా కనిపించాడు. యాంకర్ శ్యామల ఫన్నీగా జోక్స్ చేస్తుంటే నాతో జోక్స్ వద్దు అంటూ సీరియస్ అయిపోయిన వర్మ కొంత టెన్షన్ గా కనిపించాడు. ఇదిలా వుంటే వర్మ టెన్షన్ పడినట్టుగానే తన గత చిత్రాల తరహాలో `లడ్కీ`ని కూడా ఎవ్వరూ పట్టించుకోవడం లేదట. కథని, కథనాన్ని పక్కన పెట్టి పూజా భలేకర్ అందాలని చూపించడానికే వర్మ ఎక్కువ ప్రధాన్యతనివ్వడంతో ఈ సినిమా గురించి మాట్లాడే వాళ్లే కరువయ్యారట.
టేకింగ్ లో మాస్టర్ గా పేరు తెచ్చుకున్న వర్మ ఇప్పడు ఔట్ డేటెడ్ అయిపోయాడని కామెంట్ లు వినిపిస్తున్నాయి. మూస ఫార్మాట్ లో చేయడంతో `లడ్కీ`కి అదే ప్రధాన మైనస్ గా మారిందని, ఈ మూవీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని సగటు ప్రేక్షకుడు అంటున్నాడట.