వివాదాస్పద దర్శకుడు వర్మ, నాగ్ ల కాంబోలో తెరకెక్కిన `ఆఫీసర్` సినిమాకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. ఇప్పటికే.....వైటీ ఎంటర్ టైన్స్ మెంట్స్ తో వర్మకు ఉన్న లావాదేవీల వివాదం కారణంగా ఆ సినిమా విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆ కేసుకు సంబంధించి వర్మ కోర్టుకు హాజరు కాకపోవడంతోనే `ఆఫీసర్ `సినిమా విడుదలపై బాంబే హైకోర్టు స్టే విధించింది. తాజాగా, `ఆఫీసర్` విషయంలో వర్మపై మరో వివాదం చెలరేగింది. ఆ చిత్ర కథ తనదేనని జయకుమార్ అనే రచయిత వర్మపై ఆరోపణలు చేశాడు. తన కథను తీసుకున్న వర్మ....కంపెన్సేషన్ - క్రెడిట్ ఇస్తానని మోసం చేశారని జయకుమార్ ఆరోపించారు. ఈ ప్రకారం జయకుమార్ మీడియాకు ఓ లేఖ విడుదల చేశారు. వర్మపై న్యాయపోరాటానికి సిద్ధమైనట్లు తెలిపారు.
వర్మపై జయకుమార్ గతంలో ఓ కేసు నమోదు చేశారు. తన ప్రాజెక్టును వర్మ కాపీ కొట్టారని ఆరోపించారు. ఆ కేసు హైదరాబాద్ కోర్టు పరిధిలో ఉంది. తాను సర్కార్ 3 చిత్రానికి కథ అందించానని, ఆ సమయంలో `ఆఫీసర్ `కథను వర్మకు మెయిల్ చేశానని చెప్పారు. ఆ తర్వాత కథలో కొన్నిమార్పులు చేర్పులు కూడా చేసి పంపానని అన్నారు. ‘ఆఫీసర్’ సినిమా ప్రొడక్షన్ సమయంలో తనకు కంపెన్సేషన్, క్రెడిట్ ఇస్తానని వర్మ హామీ ఇచ్చి మాట తప్పారని ఆరోపించారు. తన కథను కాపీ కొట్టి క్రెడిట్ కూడా ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. తన అనుమతి లేకుండా తన హక్కులను వర్మ ఉల్లంఘించారని, తన సినీ భవిష్యత్తును వర్మ దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండస్ట్రీ పెద్దలు ఈ వివాదంలో తనకు అండగా నిలిచి న్యాయం చేయాలని కోరారు.