మామూలుగానే చాలామందికి చాలావిషయాలు అర్థం కావు... జీవితం ఎటు పోతోందో అసలు తెలియదు. సోషల్ మీడియా లో #మీటూ.. సినిమా హాల్లో ముఖేష్ యాడ్ ఎందుకు మన వెంటబడుతున్నాయో అర్థం కాదు..సోమవారం పొద్దున లేచి ఆఫీసుకు ఎందుకు పోవాలో కూడా అర్థం కాదు. ఇలా ఎన్నో విషయాలు అర్థం కాక తలపట్టుకు కూర్చుంటే రామ్ గోపాల్ వర్మ తన ట్వీట్స్ తో మన కన్ఫ్యూషన్ మరింతగా పెంచుతాడు.
రీసెంట్ గా.. అంటే టూ డేస్ క్రితం 'మణికర్ణిక' టీజర్ ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేస్తూ ఒక ట్వీట్ పెట్టాడు. ఎప్పుడో రిలీజ్ అయిన టీజర్ పై ఇప్పుడు ట్రైలర్ టాక్ ఎందుకు ఇచ్చాడు? ఎందుకంటే అయన చూసింది అప్పుడే కాబట్టి. మరి టీజర్ ను ట్రైలర్ అని ఎందుకు అనుకున్నాడు? ఏమో ఎవరికి తెలుసు.. అది కూడా వెటకారమేమో.
ఆయన ట్వీట్ ఇలా ఉంది.."ఇప్పుడే కంగనా రనౌత్ ట్రైలర్ చూశాను. నా ఉద్దేశంలో అది సూపర్ 3000 రెట్లు ఉంది." అన్నాడు. 'మణికర్ణిక' సినిమా హృతిక్ రోషన్ తాజా చిత్రం 'సూపర్ 30' కి పోటీగా జనవరి 24 న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. దీంతో 'సూపర్ 30' కంటే మణికర్ణిక 3000 రెట్లు బాగుంటుందన్న ఉద్దేశంలో వర్మ గారు ఇలా శెలవిచ్చారని కొందరు నెటిజనులు అంటున్నారు.
మరికొందరు మాత్రం డైరెక్టర్ క్రిష్ పై సెటైర్ వేశాడని.. 'మణికర్ణిక' సినిమా నుండి బయటకు వచ్చిన తర్వాత 'ఎన్టీఆర్' టేకప్ చేశాడు. ఎన్టీఆర్ సెకండ్ పార్ట్ జనవరి 24 న రిలీజ్ కానుంది. సో.. దానికంటే కంటే కూడా 'మణికర్ణిక' బెటర్ అనే ఉద్దేశంతో అని ఉండొచ్చని అంటున్నారు. ఎందుకంటే.. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా 'మహానాయకుడు' కి పోటీగా జనవరి లాస్ట్ వీక్ లో రిలీజ్ అవుతుంది కదా. మరి ఏ ఉద్దేశంతో అన్నాడో ఏంటో. కారణాలేవైనా వర్మ ట్వీట్ ను అర్థం చేసుకోవాలంటే మాత్రం స్పెషల్ టాలెంట్ ఉండాలి. లేదా ఆర్జీవీ సారే దానికి అర్థం చెప్పాలి..!