ఎంతో గొప్పగా పబ్లిసిటీ చేసుకున్న భైరవగీత ఊహించినట్టే నిరాశపరచడంతో వర్మ వెంటనే తన కొత్త సినిమా ప్రమోషన్ తో రంగంలోకి దిగుతున్నాడు. వివాదాస్పద కథాంశంతో స్వర్గీయ ఎన్టీఆర్ చరమాంకం జీవితంలో ఏం జరిగింది అనే పాయింట్ తో రూపొందుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ షూటింగ్ గుట్టుచప్పుడు కాకుండా చేసేస్తున్న వర్మ దాని తాలూకు ఫస్ట్ అప్ డేట్ ఎల్లుండి ఇవ్వబోతున్నాడు. వెన్నుపోటు పాట తాలూకు ఫస్ట్ లుక్ ని 21 సాయంత్రం 4 గంటలకు విడుదల చేస్తానని తన ట్విట్టర్ లో వర్మ ప్రకటించాడు.
అయితే ఇది ఆడియో సాంగ్ కాకపోవచ్చు. కేవలం ఆ పాట తాలూకు చిన్న విజువల్ ని లేదా బిట్ ని పోస్టర్ రూపంలో వదిలే ఆలోచన కావొచ్చు. అయినా ఇక్కడ ఆకట్టుకుంటున్న విషయం అది కాదు. ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో అత్యంత వివాదాస్పదంగా చెప్పుకునే ఈ వెన్నుపోటుతోనే వర్మ లక్ష్మిస్ ఎన్టీఆర్ పబ్లిసిటీ స్టార్ట్ చేయడం విశేషం. ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. వర్మ ఈ లుక్ ని విడుదల చేస్తున్న రోజే బాలయ్య నిర్మిస్తూ నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో ప్లస్ ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో ఘనంగా జరగనుంది.
అంటే ఆ వేడుక మొదలుకాక మునుపే ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ వెన్నుపోటు పోస్టర్ ఆన్ లైన్ లోకి వచ్చేస్తుందన్న మాట. బాలకృష్ణ ఎన్టీఆర్ తో తనకేమి పోటీ లేదంటూనే ఇలా కవ్వించే చర్యల ద్వారా తన ఉద్దేశమేంటో వర్మ చెప్పకనే చెబుతున్నాడు. వెన్నుపోటు పోస్టర్ లో చంద్రబాబుని చూపిస్తాడా లేక ఇంకేమైనా షాక్ ఇచ్చే అంశాలు ఉంటాయా అనేది శుక్రవారం మధ్యాన్నం తేలిపోతుంది.