వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈమద్య కాలంలో అత్యంత వివాదాస్పద చిత్రంగా రూపొందిస్తున్న చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఈ చిత్రం పూర్తిగా ‘ఎన్టీఆర్’ మూవీని టార్గెట్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్నాడని అంతా అంటున్నారు. నేడు ‘ఎన్టీఆర్’ మూవీ ఆడియో విడుదల కాబోతున్న సమయంలో వెన్ను పోటు సాంగ్ ను విడుదల చేయడం చర్చనీయాంశం అయ్యింది.
కళ్యాణి మాళిక్ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ పాట మ్యూజిక్ ఏమాత్రం ఆకట్టుకోలేదు. అయితే పాటలోని లిరిక్స్ మాత్రం కాస్త గట్టిగా ఉన్నాయి. శకుని, వెన్ను పోటు, కుట్ర అంటూ పెద్ద పదాలు వాడిన వర్మ బాబును బాగా టార్గెట్ చేశాడు. లిరిక్స్ తో పాటు ఎన్టీఆర్ తో ఉన్న చంద్రబాబు నాయుడు ఫొటోలను ప్లే చేశాడు. ఎన్టీఆర్ సినిమా గురించి చర్చ జరుగుతున్న ఈ సమయంలో వెన్ను పోటు పాట విడుదల అవ్వడం ఖచ్చితంగా ఆ సినిమాపై ప్రభావం చూపుతుందని కొందరు విశ్లేషిస్తున్నారు.
Full View

లిరిక్స్ విషయం పక్కన పెడితే పరమ రొటీన్ ట్యూన్ తో కళ్యాణి మాలిక్ ఈ పాటను ట్యూన్ చేయడం కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తుంది. గతంలో మంచి సాంగ్స్ ను సంగీత దర్శకులతో ట్యూన్ చేయించుకున్న వర్మ ఈసారి మాత్రం లిరిక్స్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్లుగా అనిపించింది. ఈ పాట సినిమాలో ఎలా ఉంటుందో అనేది చూడాలి.