తను నేను కొనుక్కున్నా.. ‘సోగ్గాడే..’ రాసిచ్చా

Update: 2015-11-25 09:30 GMT
దర్శకులు నిర్మాతలుగా మారడం మామూలే. కానీ నిర్మాతలు రచయితలవడం, దర్శకులుగా మారడం.. చాలా అరుదుగా జరిగే విషయం. ఈ కోవలోకే వస్తాడు రామ్ మోహన్. అష్టాచెమ్మా - గోల్కొండ హైస్కూల్ - ఉయ్యాల జంపాల లాంటి అభిరుచి ఉన్న సినిమాల్ని నిర్మించిన రామ్ మోహన్... ఈ శుక్రవారం విడుదల కాబోయే ‘తను నేను’తో దర్శకుడిగా మారాడు. తన నిర్మాణంలో వచ్చిన సినిమాలకు రచనా సహకారం కూడా అందించిన ఆయన.. నాగార్జున హీరోగా నటిస్తున్న ‘సోగ్గాడే చిన్ని నాయనా’కు కథ కూడా అందించడం విశేషం. ప్రొడక్షన్ నుంచి రైటింగ్ - డైరెక్షన్ లోకి రావడం గురించి ఆయన ఆసక్తిక విశేషాలు వెల్లడించారు. అవేంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం పదండి.

‘‘ఎంబీఏ చదివిన నేను సురేష్ బాబు గారి బేనర్ లో ప్రొడక్షన్ వ్యవహారాల్లో చూడటంతో సినీ ప్రస్థానం ఆరంభించాను. ఈ ప్రయాణంలో సినిమాలపై మంచి అవగాహన వచ్చింది. నా నిర్మాణంలో వచ్చిన సినిమాలకు రచనా సహకారం అందించాను. తను నేను కథ రామానాయుడు ఫిలిం స్కూల్ కి చెందిన సాయి సురేష్ రాసుకున్నాడు.. స్క్రిప్ట్ చదివాక తననే డైరెక్ట్ చేయమన్నా. కానీ అతడు అమెరికా వెళ్లిపోయాడు. నేను అతడి దగ్గర్నుంచి కథ కొనుక్కున్నా. వేరే వాళ్ల డైరెక్షన్ లో తీయడానికి ట్రై చేశా కానీ కుదర్లేదు. పైగా ఈ కథను నేను డైజెస్ట్ చేసుకున్నట్లు వేరెవరూ చేసుకోలేరనిపించి నేనే దర్శకుడిగా మారాను. తొలిసారి డైరెక్షన్ చేస్తూనే 33 రోజుల్లో సినిమా పూర్తి చేశాను. క్వాలిటీ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. సోగ్గాడే చిన్నినాయనా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఓ లైన్ చెప్పాడు. దాన్ని కథగా డెలవప్ చేసి ఇచ్చాను’’ అని రామ్మోహన్ చెప్పాడు.
Tags:    

Similar News