హీరో రామ్ కొత్త సినిమా ప్రారంభం అవుతోంది. రామ్ కు నేను శైలజ వంటి హిట్ ఇచ్చి.. ట్రాక్ లోకి తీసుకొచ్చిన కిషోర్ తిరుమల దర్శకత్వంలోనే తన తర్వాతి సినిమా చేయనున్నాడు రామ్. ఎనర్జిటిక్ హీరో చేస్తున్న 15వ సినిమా ఇది. ఇప్పటికే ఈ లవ్ స్టోరీలో నటించబోయే హీరోయిన్స్ విషయంలో కూడా క్లారిటీ వచ్చేసింది. మేఘా ఆకాష్ ను ముందే ఎంపిక చేయగా.. లీడ్ హీరోయిన్ గా అనుపమా పరమేశ్వరన్ ను ఫైనల్ చేశారు.
ఈ నెల 29న ఈ చిత్రం అఫీషియల్ గా ప్రారంభం కానుండగా.. అనుపమ నవ్వుతున్న ఓ ఫోటోకు రామ్ పెట్టిన ట్వీట్ ఇప్పుడు నవ్వులాట అయిపోతోంది. "నేను ఈ స్క్రిప్ట్ విన్న తర్వాత నా మొహంలో కూడా అలాంటి నవ్వే వచ్చింది. అదే నవ్వు మీ అందరి మొహాలపై చూడాలని అనుకుంటున్నారు. రామ్15 కోసం ఎదురుచూస్తున్నా" అన్నాడు రామ్. అంతా బాగానే ఉంది కానీ.. జనాల ఫేస్ లో నవ్వు కోసం ఈ సినిమా చేస్తున్నానని చెప్పడమే కూసింత కామెడీ అనాలి. ఎందుకంటే.. ట్రాక్ ఎక్కినట్లే ఎక్కి హైపర్ తో బోల్తా కొట్టిన రామ్.. తీస్తే హిట్ సినిమానే తీయాలని 6-7 నెలలుగా ఖాళీగానే ఉన్నాడు.
ముందు తను హిట్ కొట్టి.. తన కెరీర్ ను రైట్ ట్రాక్ లోకి తీసుకొచ్చి.. మనస్ఫూర్తిగా ఆనందించాల్సిన పరిస్థితిలో ఉన్నాడీ హీరో. ఎందుకంటే.. ఈ యంగ్ హీరోకి పోటీ హీరోలంతా వరుస హిట్స్ దూసుకుపోతుంటే రామ్ మాత్రం వెనకబడిపోతున్నాడు. అలాంటిది జనాల మొహంలో నవ్వు చూడ్డానికి అనడం కరెక్ట్ కాదేమో రామ్!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/