కుర్ర హీరో కోసం సాఫ్ట్ వేర్ కుర్రాళ్ళ కథ

Update: 2018-06-08 16:39 GMT
టాలీవుడ్ లో ప్రస్తుతం సక్సెస్ కోసం ప్రయత్నం చేస్తున్న హీరోల్లో రామ్ కూడా ఉన్నాడు. కెరీర్ సక్సెస్ రేట్ తక్కువగా ఉన్న ఈ హీరో తన రేంజ్ ను ఒక లెవెల్లో మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. సినిమా సినిమాకు క్రేజ్ పెంచుతున్నాడు గాని సక్సెస్ మాత్రం అందుకోవడం లేదు. నేను శైలజా సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమాతో రికవర్ అయ్యాడులే అనుకున్నప్పటికీ వరుసగా మళ్లీ డిజాస్టర్స్ బాట పట్టాడు.

అతనికి హిట్ ఇద్దామని పెదనాన్న స్రవంతి రవి కిషోర్ కూడా చాలా కథలు వింటున్నాడు. కానీ రామ్ కి పెద్దగా సెట్ అయ్యే కథలు రావడం లేదట. ఇకపోతే రీసెంట్ ఇద్దరు కొత్తవాళ్లు రాసుకున్న కథను రవికిశోర్ ఒకే చేసినట్లు తెలుస్తోంది. బెంగుళూర్ లో సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్న ఇద్దరు తెలుగు యువకులు కలిసి రాసుకున్న కథ ఈ సీనియర్ నిర్మాతకు బాగా నచ్చేసిందట. వారిద్దరూ సినిమా చేయాలనీ కసితో ఉండడం చూసి ఎలాంటి అనుభవం లేకపోయినా అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయ్యారట.

సీనియర్ లనే నమ్మలేని ఈ రోజుల్లో ఏ అనుభవం లేని సాఫ్ట్ వేర్ లకు అవకాశం ఇవ్వడం అంటే రిస్క్ తో కూడుకున్న పని.  మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని రామ్ అయితే ఛాన్స్ తీసుకునే పరిస్థితుల్లో లేడట. ప్రస్తుతం సక్సెస్ ఫుల్ దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో హలొ గురు ప్రేమ కోసమే అనేసినిమా చేస్తున్నాడు. మరి ఈ  సినిమా సక్సెస్ తరువాత రామ్ సాఫ్ట్ వేర్లు చెప్పిన కథ చేస్తాడా లేక వేరే వాళ్ల కథ చేస్తాడా అనేది చూడాలి.  

Tags:    

Similar News