అవ‌కాశ‌మే అవార్డులాంటిది!

Update: 2018-12-12 12:00 GMT
ప‌ని చేసిన తొలి సినిమాతోనే గొప్ప క‌ళాద‌ర్శ‌కులు అన్న పేరు తెచ్చుకున్నారు. ఆ త‌ర్వాత ఒక్కో సినిమా కి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇండ‌స్ట‌రీ బెస్ట్ క‌ళాద‌ర్శ‌కులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అందాల రాక్ష‌సి- సాహ‌సం- రంగ‌స్థ‌లం .. ఈ సినిమాల్లో హీరోల న‌ట‌న‌తో పాటు వేరొక ప్ర‌త్యేక‌త గురించి జ‌నం గొప్ప‌గా మాట్లాడుకున్నారు. అస‌లు ఈ సినిమాల‌కు సెట్స్ వేసింది ఎవ‌రు? అంటూ వాక‌బు చేసిన‌వాళ్లు ఉన్నారు. అయితే ఆ సినిమాల‌కు అద్భుత‌మైన సెట్స్ వేసి అంద‌రి దృష్టిని త‌న‌ వైపు తిప్పుకున్న‌ ఘ‌న‌త మాత్రం రామ‌కృష్ణ‌- మోనిక జంట‌దే. ఈ జోడీ క‌ళారంగం పై మ‌క్కువ‌తో క‌ళాద‌ర్శ‌క‌త్వ ంలో అడుగు పెట్టి స‌త్తా చాటుతున్న వైనం ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కొచ్చింది. తాజాగా వ‌రుణ్ తేజ్‌- సంక‌ల్ప్ రెడ్డి -రాజీవ్ రెడ్డి - క్రిష్ కాంబినేష‌న్ మూవీ అంత‌రిక్షం 9000కెఎంపిహెచ్ చిత్రానికి ఈ జోడీ సెట్స్ వేశారు. స్పేస్ షిప్- స్పేస్ సెంట‌ర్ బ్యాక్‌డ్రాప్ లో మెజారిటీ పార్ట్ చిత్రీక‌ర‌ణ సాగిన ఈ సినిమా కోసం ఆ రెండిటినీ స‌మ‌కూర్చింది ఈ జోడీనే. ఇందుకోసం మూడు నెల‌ల పాటు నిద్రా హారాలు మానుకుని మ‌రీ శ్ర‌మించార‌ట‌. ఈనెల 21న సినిమా రిలీజ్ సంద‌ర్భ ంగా హైద‌రాబాద్‌ లో పాత్రికేయుల‌తో ముచ్చ‌టించారు.

అంత‌రిక్షం ఛాలెంజింగ్‌ గా మూవీ. తెలుగులో ఇప్ప‌టి వ‌ర‌కూ ఇలాంటి క‌థ‌తో సినిమా రాలేదు. సంక‌ల్ప్ ప్ర‌తిదీ క్లారిటీతో స్టోరీబోర్డ్ వేసుకుని మ‌రీ చెప్ప‌డంతో మా ప‌ని చాలా సులువైంది. ఈ క‌థాంశ‌మే అనంతం అనిపించే విధంగా ఉంది. ఎవ‌రు ఎంత చేస్తే అంత వ‌ర్క‌వుట్ అయ్యే సినిమా. మెజారిటీ భాగం క‌థంతా స్పేస్‌లోనే కాబ‌ట్టి, మేం వేసిన సెట్స్ లోనే చిత్రీక‌రించారు. స్పేస్ షిప్స్, స్పేస్ సెంట‌ర్ గురించి ఎంతో చ‌దివి ప‌రిశోధించి, తెర‌కెక్కించాం. ఇక‌పోతే ఈ సినిమా కోసం ఇస్రోలో- స్పేస్ సెంట‌ర్ల‌లో ప‌ని చేస్తున్న స్నేహితులు ఇచ్చిన స‌మాచారం ప్ర‌కారం సెట్లు డిజైన్ చేసాం.. ఇస్రో లాంటి చోట అనుమ‌తి ల‌భించ‌డం క‌ష్టం. మాకు ఉన్న త‌క్కువ స‌మ‌యంలో, ప‌రిమిత బ‌డ్జెట్‌ లో ది బెస్ట్ సెట్స్‌ని అంత‌రిక్షం కోసం సెట్స్ వేశాం. సంక‌ల్ప్ రెడ్డి క్లారిటీ, రాజీవ్ గారి నిర్మాణ స‌హ‌కారం వ‌ల్ల‌నే ఇది సాధ్య‌మైంది.

మైత్రీ మూవీస్ లో ఓ సినిమా చేస్తున్నాం. హిర‌ణ్య‌- మాధ‌వ‌న్ చిత్రం, సుకుమార్ తో సినిమా చేస్తున్నాం. ఒకేసారి రెండు సినిమాలు మించి చేసే అల‌వాటు లేదు. కానీ ఈ ఏడాది పూర్తిగా బిజీ అయ్యాం. అలాగే అవార్డులు అంటే సినిమా చూసి మీలాంటి వాళ్లు ఇచ్చే కాంప్లిమెంట్లే. అంత‌రిక్షం లాంటి సినిమాలు చేసే అవ‌కాశం ద‌క్క‌డ‌మే అవార్డు. చిన్నా చిత‌కా సినిమాల‌కు జీరో బ‌డ్జెట్ సినిమాల‌కు ప‌ని చేశాం. ఇక రంగ‌స్థ‌లం లాంటి సినిమాకి ప‌ని చేశాకే అస‌లైన గుర్తింపు ద‌క్కింది. అందాల రాక్ష‌సి తో పోలిస్తే రంగ‌స్థ‌లం చిత్రంలో స్టార్ ప‌వ‌ర్ మాకు పేరు తెచ్చి పెట్టింది.. అని తెలిపారు.

Tags:    

Similar News