రాజమౌళి సినిమాలంటే ఒక ఫ్యామిలీ ప్యాకేజ్. తన సినిమాలకు కథ తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ రాస్తే.. అన్నయ్య కీరవాణి సంగీతాన్నందిస్తాడు. రాజమౌళి భార్య రమ కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తుంది. ఆయన వదిన వల్లి లైన్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు చూస్తుంది. అందరూ ప్రతిభావంతులే.. సమర్థులే కాబట్టి ఔట్ పుట్ కూడా బాగానే ఉంటుంది. ఈ ఫ్యామిలీపై ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయం ఉంది. వారిపై గౌరవం కూడా ఉంది. ఐతే ఇండస్ట్రీలోని కొందరు మాత్రం రాజమౌళి బయటి వాళ్లకు అవకాశం ఇవ్వడంటూ విమర్శిస్తుంటారు. అలాంటి వాళ్లకు రాజమౌళి సతీమణి రమ గట్టి బదులే ఇచ్చింది.
తాము పనికి రాని వాళ్లను అందలమెక్కించి.. వారిని బలవంతంగా ఇండస్ట్రీపై రుద్దాలని ప్రయత్నించడం లేదని.. తమ వల్ల ఏదైనా తప్పు జరిగి ఉంటే.. ఎవరికైనా నష్టం వచ్చి ఉంటేనే.. ఈ విషయంలో తమను విమర్శించాలని రమ అంది. హార్డ్ వర్క్ అన్నది తమ జీన్స్ లోనే ఉందని.. తమలా ఎవ్వరూ కష్టపడలేరని ఆమె తేల్చి చెప్పింది. సినిమాకు సంబంధించిన పనులన్నీ తాము సమర్థంగా చేసుకోగలిగినపుడు బయటి వాళ్లు ఎందుకని ప్రశ్నించింది. తమ కుటుంబ సభ్యులకు కలిసి పని చేసే సత్తా ఉందని చెప్పింది. ‘‘ఛాలెంజ్ చేసి చెబుతున్నా.. మేం చేసినంత పని ఇండస్ట్రీలో ఇంకెవ్వరూ చేయలేరు. మేం 20 గంటలు ఫీల్డ్ మీద నిలబడి పని చేయగలం. నాలుగున్నరేళ్లుగా ‘బాహుబలి’ కోసం అలాగే పని చేశాం. అలా ఎవరైనా చేయగలరా’’ అని రమ ప్రశ్నించింది. తాము ఎవరినీ ప్రశ్నించకుండా.. రూల్స్ మాట్లాడకుండా.. ఇది తమ ప్రాజెక్ట్ అనుకుని ఎవరి పనిని వాళ్లు సమర్థంగా పూర్తి చేస్తామని.. అందుకే తమకు మంచి ఫలితాందుతున్నాయని రమ తెలిపింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/