బాలకృష్ణ - క్రిష్ ల కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ స్టార్స్ తో నింపేస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రంలో అప్పటి హీరో - హీరోయిన్స్ - దర్శకులు - నిర్మాతల పాత్రలకు గాను స్టార్స్ ను ఎంపిక చేసిన దర్శకుడు క్రిష్ తాజాగా లెజెండ్రీ రైటర్ - కవి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి పాత్రకు గాను మరో స్టార్ రైటర్ ను ఎంపిక చేయడం జరిగింది.
తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం ఎలాంటి పాటలనైనా చక్కగా రాయగలడు అంటూ పేరు సంపాదించుకున్న రామజోగయ్య శాస్త్రి ని ‘ఎన్టీఆర్’ చిత్రంలో నటింపజేస్తున్నారు. ఇప్పటికే ఈయన పలు సినిమాల్లో ఇలా వచ్చి అలా మెరిసి వెళ్లి పోయిన విషయం తెల్సిందే. అలాగే ‘ఎన్టీఆర్’ చిత్రంలో కూడా కొన్ని నిమిషాల పాటు బాలకృష్ణతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లుగా సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది. దర్శకుడు విఠలాచార్య పాత్రకు దర్శకుడు శంకర్ ను ఎంపిక చేసిన క్రిష్ ఇప్పుడు రైటర్ సినారె పాత్రకు రైటర్ రామజోగయ్య శాస్త్రి ని ఎంపిక చేయడం జరిగింది.
ఎన్టీఆర్ కు సినారెకు మంచి సన్నిహిత సంబంధాలు ఉండేవట. కవి అయిన సినారెను ఎన్టీఆర్ గారు సినిమాల్లోకి తీసుకు వచ్చారు. ఎన్నో ఛారిత్రాత్మక - పౌరాణిక చిత్రాలకు తన సాహిత్యంను అందించి తెలుగు సినిమా పరిశ్రమలో తనదైన ముద్రను వేసిన సినారె గారి పాత్ర లేకుండా ‘ఎన్టీఆర్’ బయోపిక్ ఎలా ఉంటుంది. అందుకే సినారె పాత్రను జోడివ్వడంతో పాటు - అందుకు తగ్గట్లుగా రామజోగయ్య శాస్త్రిని క్రిష్ ఎంపిక చేశాడు. రోజుకో వార్తతో ‘ఎన్టీఆర్’ సినిమాపై క్రిష్ అంచనాలు పెంచేస్తున్నాడు. ముందు ముందు మరెంత మంది స్టార్స్ ను ఈ చిత్రంలో దించుతాడో చూడాలి.