ఓవర్ సీస్ లో రామారావు ను పట్టించుకునేవారే లేరా..?

Update: 2022-07-30 11:30 GMT
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన కొత్త సినిమా ''రామారావు ఆన్ డ్యూటీ''. శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. అయితే తొలి రోజే ఈ మూవీ ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.

'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా రవితేజ మార్క్ మాస్ మూవీ కాదని ప్రమోషనల్ కంటెంట్ తోనే అర్థమైంది. కాకపోతే ఒక స్పెషల్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్రమోట్ చేయడంతో.. డిఫెండర్ జోనర్ లో మాస్ రాజా ఎలా చేస్తాడో అనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే తీరా సినిమా చూశాక ఫ్యాన్స్ సైతం నిరాశ చెందారు.

తెలుగు రాష్ట్రాల్లో రామారావు పరిస్థితి ఎలా ఉందనేది పక్కన పెడితే.. ఓవర్ సీస్ లో అసలు ఈ చిత్రాన్ని పట్టించుకునేవారే లేరని అంటున్నారు. 'ఖిలాడి' తో పోల్చి చూస్తే ఈ సినిమాకి యూఎస్ఏ ప్రీమియర్స్ ద్వారా కాస్త బెటర్ కలెక్షన్స్ వచ్చాయి. కాకపోతే నెగెటివ్ టాక్ రావడంతో అడ్వాన్స్ బుకింగ్స్ పూర్తిగా పడిపోయాయని తెలుస్తోంది.

నిజానికి రవితేజ సినిమా అంటే తన మార్క్ కామెడీ మరియు ఎంటర్టైన్మెంట్ కోసం ఎన్నారై ఆడియన్స్ థియేటర్లకు వెళ్లేవారు. అయితే రాను రాను మాస్ మహారాజా రొటీన్ కమర్షియల్ సినిమాలతో బోర్ కొట్టించడంతో.. క్రమక్రమంగా అక్కడ రవితేజ చిత్రాలపై ఆసక్తి తప్పిపోతూ వచ్చింది.

ఇప్పుడు 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాలోనూ రవితేజ నుంచి ఆశించే అంశాలివే లేవు. మెయిన్ పాయింట్ లో మ్యాటర్ ఉన్నపటికీ.. ఆ పాయింట్ కి తగ్గట్టు స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకుడు విఫలమయ్యాడని అంటున్నారు.

ఆద్యంతం ఉత్కంఠభరితంగా తీయాల్సిన కాన్సెప్ట్ ని.. ఏమాత్రం ఆకట్టుకోని బోరింగ్ కథనంతో నడిపించారని కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా యూఏస్ లో రెస్పాన్స్ ని బట్టి ఓవర్ సీస్ లో 'రామారావు' సినిమా డిజాస్టర్ గా మారే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

కాగా, 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాలో రవితేజ ఒక నిజాయితీ గల గవర్నమెంట్ ఆఫీసర్ గా కనిపించాడు. దివ్యాంశ కౌశిక్ - రజిషా విజయన్ హీరోయిన్స్ గా నటించగా.. వేణు తొట్టెంపూడి చాలా రోజుల తర్వాత ఈ చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు.

 శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని రూపొందించారు. రవితేజ తన హోమ్ బ్యానర్ ఆర్టీ టీమ్ వర్క్స్ ను కూడా ప్రొడక్షన్ లో ఇన్వాల్వ్ చేశారు. శ్యామ్ సీఎస్ సంగీతం సమకూర్చగా.. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు.
Tags:    

Similar News