RRR ప్రారంభానికి చాలా ముందే రామ్ చరణ్- ఎన్టీఆర్ మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. తారక్ నటించే సినిమాలకు చరణ్ నుంచి ప్రశంసలు తప్పనిసరి. చరణ్ కోసం తారక్ దేనికైనా సై అనేస్తాడు. అందుకే ఆ ఇద్దరినీ కలిపి దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమాని ప్లాన్ చేసి విజయం సాధించాడు. ఈ సినిమా దాదాపు 1000 కోట్లు వసూలు చేయడం ఒక సంచలనం. ఇప్పుడు జపాన్ లోను మానియా ప్రారంభించబోతోంది.
ఆర్.ఆర్.ఆర్ జపనీ వెర్షన్ ప్రమోషన్స్ కోసం తారక్ .. చరణ్ ఇద్దరూ తమ కుటుంబాలతో జపాన్ లో అడుగుపెట్టారు. రామ్ చరణ్ ఇటీవల విమానాశ్రయంలో జపాన్ కు బయలుదేరాడు. అక్టోబర్ 21న జపాన్ లో విడుదల సందర్భంగా ప్రమోషన్స్ కోసం రాజమౌళి సహా రామ్ చరణ్ జూ.ఎన్ టిఆర్ కూడా జపాన్ పయనమయ్యారు. జపాన్ లో బాహుబలి -1.. బాహుబలి 2 సంచలన విజయాలు సాధించాయి. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ పైనా భారీ అంచనాలున్నాయి. దీంతో మేకర్స్ విడుదల కోసం పెద్ద ఎత్తున ప్రచార ప్రణాళికకు ప్లాన్ సిద్ధం చేసారు. జపాన్ లో ఆర్.ఆర్.ఆర్ మానియా ఒక రేంజులో ఉందని ఇప్పటికే టాక్ ఉంది.
ఆస్కార్ 2023 కోసం ప్రచారం ప్రారంభమయ్యే ముందు జపాన్ లో ఆర్.ఆర్.ఆర్ కోసం పెద్ద ప్రచార కార్యక్రమం ప్లాన్ చేయడం ఆసక్తిని కలిగిస్తోంది. తాజా సోర్స్ ప్రకారం...చిత్రబృందం జపాన్ లో పాపులర్ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలకు సిద్ధమయ్యారని తెలిసింది. దానితో పాటు, ఇతర స్థానిక పత్రికలతో పరస్పర ఇంటరాక్షన్ కి ప్లాన్ చేసారు. మరోవైపు RRR టిక్కెట్లు ప్రీబుకింగ్ కి మంచి డిమాండ్ ఉందని తెలిసింది.
ఈ చితరంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రను పోషించగా.. రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో నటించారు. అలియా భట్ సీత పాత్రను పోషించగా.. అజయ్ దేవ్‌గన్ కీలక పాత్రలో కనిపించారు. ఈ చిత్రం మార్చి 25 న భారతదేశంలో విడుదలైంది. ప్రస్తుతం తారక్ కొరటాల శివతో ఎన్టీఆర్ 30 కోసం పని చేయాల్సి ఉంది. అలాగే రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో ఆర్.సి 15 ని పూర్తి చేసేందుకు శ్రమిస్తున్న సంగతి తెలిసిందే.
NTR స్క్రిప్టు మారింది..?!
ఎన్.టి.ఆర్ 30 స్క్రిప్టింగ్ కోసం కొరటాల సుదీర్ఘ సమయం తీసుకున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలలుగా ఈ స్క్రిప్టుపై పని చేస్తున్నా ఇంకా ఇది పూర్తి కాలేదని తెలిసింది. తాజా సమాచారం మేరకు..జూ. NTR కోసం పాన్-ఇండియా కథాంశాన్ని కొరటాల ఎంపిక చేసుకున్నారు. తారక్ మారిన ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకుని మేకర్స్ ఈ చిత్రం కథను పూర్తిగా మార్చారని సమాచారం. నిజానికి విద్యార్థుల రాజకీయాల చుట్టూ కథను రాసుకున్నా ఇప్పుడు దాంతో సంబంధం లేకుండా మరో కొత్త కథను కొరటాల ఎంపిక చేసుకున్నారని తెలిసింది.
తాజా సమాచారం ప్రకారం స్క్రిప్టు తుది దశకు చేరుకుంది. ఇది గరుడ పురాణం ఆధారంగా రూపొందించిన కథ. పక్షుల రాజు గరుడకు... విష్ణువుకు మధ్య జరిగిన సంభాషణ ఆధారంగా పురాణేతిహాస కథను ఎంపిక చేసుకున్నారు. ఇక ద్వితీయార్థంలో అంత్యక్రియల కర్మలు - పునర్జన్మలకు కారణమయ్యే మెటాఫిజిక్స్ వంటి అంశాలతో అనుసంధానించబడిన సమస్యలను తెరపై చూపిస్తారని సమాచారం.
కొరటాల ఎంచుకున్న కథాంశం మరింత హైప్ పెంచుతోంది. ఎన్‌టిఆర్ 30 పై అమాంతం అంచనాలను పెంచుతోంది. ఆచార్య పరాజయం తరువాత ఎన్.టి.ఆర్ 30 కొరటాలాకు చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్. ఆర్.ఆర్.ఆర్ తో వచ్చిన ఇమేజ్ కి తగ్గట్టుగా ఇప్పుడు తారక్ కూడా స్క్రిప్టు ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.