మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డ్యూయల్ లుక్ లో సర్ ప్రైజ్ చేయబోతున్నారా? అంటే అవుననే సమాచారం. తన సినిమాల్లో హీరో పాత్రను రకరకాల కోణాల్లో ఆవిష్కరించడం శంకర్ శైలి. ఇంతకుముందు రజనీకాంత్ - అర్జున్- విక్రమ్ లాంటి స్టార్లను ఎంతో విలక్షణంగా ప్రెజెంట్ చేసిన ఘనత ఆయనకే చెందుతుంది. అప్పట్లో సుజాత రంగరాజన్ లాంటి మేటి సైన్స్ ఫిక్షన్ రైటర్ శంకర్ కొలువులో ఉన్నంత కాలం ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఇక రోబో కు కథ ఇచ్చిన తర్వాత ఆయన మరణించారు. ఆ తర్వాత శంకర్ ఐ - 2.0 లాంటి భారీ చిత్రాలను తెరకెక్కించారు. ఇప్పుడు ఆర్.సి 15 చిత్రంతో బిజీగా ఉన్నారు.
ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పొలిటికల్ థ్రిల్లర్ ఆర్‌సి 15 హాట్ టాపిక్ గా మారింది. చరణ్ తాజా షెడ్యూల్ లో బిజీగా ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం శరవేగంగా పూర్తి చేసేందుకు శంకర్ షెడ్యూల్స్ ని ప్లాన్ చేశారు. తాజా సమాచారం ప్రకారం.. చరణ్ RC15లో డ్యూయల్ లుక్ లో కనిపించబోతున్నాడు.
రెండు లుక్స్‌లో చాలా వేరియేషన్ ఉంటుంది. ఇందులో ఒక లుక్ లో బ్యూరోక్రాట్ గా కనిపిస్తే.. మరో లుక్ లో క్యాజువల్ లుక్ లో కనిపించనున్నాడు. RC15 పాన్-ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న అత్యంత భారీ చిత్రం. దీనికోసం దిల్ రాజు అండ్ కో 400కోట్లు పైగా ఖర్చు చేయనున్నారు. ఇందులో కియారా అద్వానీ కథానాయిక. ఈ సినిమా వచ్చే సంక్రాంతి సీజన్ కి విడుదల కానుంది. శంకర్ మరోవైపు భారతీయుడు 2 చిత్రీకరణను పూర్తి చేయాల్సి ఉన్న సంగతి తెలిసిందే.
ద్విపాత్రలు త్రిపాత్రలు చేయడంలో మెగాస్టార్ చిరంజీవి తర్వాతే. మాస్ ని అలరించడంలో కమర్షియల్ సినిమా రారాజుగా ఆయన ఎన్నో రికార్డులు సృష్టించారు. ఇప్పుడు తండ్రి స్ఫూర్తితోనే చరణ్ సరికొత్తగా డ్యూయల్ రోల్స్ తో అలరించాలని మెగాభిమానులు కోరుకుంటున్నారు. శంకర్ తో సినిమాని అతడు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించాడు.
ఆర్.ఆర్.ఆర్ తర్వాత వెంటనే ఆర్.సి 15 ని శంకర్ తో ప్లాన్ చేయడం వెనక బోలెడంత ప్లానింగ్ ఉంది. పాన్ ఇండియా స్టార్ గా తనని నిలబెట్టే రెండు వరుస చిత్రాలను ఇద్దరు సౌత్ అగ్ర దర్శకులతో ప్లాన్ చేశాడు. ఆర్.ఆర్.ఆర్ త్వరలోనే విడుదల కానుంది. అలాగే శంకర్ తో సినిమా వచ్చే సంక్రాంతికి విడుదలవుతుంది. ఈ రెండు సినిమాలు తన రేంజును అమాంతం పెంచుతాయని చరణ్ హోప్ తో ఉన్నాడు. తదుపరి జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితోనూ ఓ చిత్రం చేయనున్నాడు.
ఇంతలోనే మరో పాన్ ఇండియా డైరెక్టర్ కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ తోనూ చరణ్ సినిమా ఉంటుంది. బాహుబలి స్ఫూర్తితోనే ఇతర హీరోలంతా ఇప్పుడు పాన్ ఇండియా స్టార్లుగా తమను తాము ఆవిష్కరించుకునేందుకు పోటీపడుతున్న సంగతి తెలిసిందే. ఈ లీగ్ లో పుష్ప పెద్ద సక్సెసైంది. బన్ని రేంజు ఇప్పుడు స్కైని టచ్ చేస్తోంది.
ఇది మెగా కాంపౌండ్ లోనూ పోటీతత్వాన్ని మరింతగా రాజేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక చరణ్ తనని తాను పాన్ ఇండియా మార్కెట్లో నిరూపించుకోవాల్సి ఉంది. రాజమౌళి- శంకర్- గౌతమ్ తిన్ననూరి- ప్రశాంత్ నీల్ .. ఈ లైనప్ చూస్తుంటే అతడికి మునుముందు ఎలాంటి డోఖా లేదని అర్థమవుతోంది.