చ‌ర‌ణ్ కూడా ఆ విష‌యంలో దూకుడు పెంచాడుగా!

Update: 2022-08-30 10:21 GMT
ఓ మూవీ పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బ‌స్ట‌ర్ అనిపించుకుంటే అందులో న‌టించిన హీరోల క్రేజ్ ని క్యాష్ చేసుకోవాల‌ని ప‌లు బ్రాండ్ లు పోటీప‌డుతుంటాయి. క్రేజ్ కి త‌గ్గ‌ట్టే రెమ్యున‌రేష‌న్ ల‌ని కూడా ఆఫ‌ర్ చేస్తూ స‌ర్ ప్రైజ్ చేస్తుంటాయి. అయితే ఈ విష‌యంలో సూప‌ర్ స్టార్‌ మ‌హేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముందు వ‌రుస‌లో వున్నారు.

'పుష్ప‌' పాన్ ఇండియా వైడ్‌గా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచి భారీ క్రేజ్ ని తెచ్చిపెట్ట‌డంతో బ‌న్నీ ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకుంటూ ప్ర‌తీ బ్రాండ్ ని ప‌ట్టేస్తూ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా బిజీ అయిపోయాడు.

ఇక స‌క్సెస్, ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు గ‌త కొంత కాలంగా వ‌రుస క‌మ‌ర్షియ‌ల్ బ్రాంబ్ ల‌ని గ్రాబ్ చేస్తూ టాలీవుడ్ లో టాప్ మోస్ట్ బ్రాండ్ ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా నిలిచి రికార్డు సృష్టిస్తున్నారు. అయితే 'RRR'తో వ‌ర‌ల్డ్ వైడ్ గా సంచ‌ల‌నం సృష్టించిన మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ లు మాత్రం ఈ మూవీ ద్వారా వ‌చ్చిన క్రేజ్ ని క్యాష్ చేసుకోలేక‌పోతున్నార‌నే కామెంట్ లు ఇటీవ‌ల వినిపిస్తున్నాయి.

మ‌హేష్ బాబు, అల్లు అర్జున్ వ‌రుస బ్రాండ్ ల‌పై దృష్టిపెడితే రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ మాత్రం త‌మ త‌దుప‌రి ప్రాజెక్ట్ ల‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టారు. ఎలాంటి బ్రాండ్ ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌లేదు. అయితే తాజాగా మెగా ప‌వ‌ర్ స్టార్ ఈ విష‌యంలో దూకుడు పెంచేశాడు. చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం శంక‌ర్ డైరెక్ష‌న్ లో ఓ భారీ మూవీని చేస్తున్న విష‌యం తెలిసిందే. శంక‌ర్ 'ఇండియ‌న్ 2' షూటింగ్ ని తిరిగి ప్రారంభించే ప‌నుల్లో బిజీగా వుండ‌టంతో చ‌ర‌ణ్ కు కాస్త టైమ్ ల‌భించింది.

ఈ నేప‌థ్యంలోనే చ‌ర‌ణ్ కొత్త బ్రాండ్ కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసిన‌ట్టుగా తెలిసింది. హీరో మొట‌ర్ సైకిల్  బ్రాండ్ ల‌కు దేశ వ్యాప్తంగా మంచి పేరు, మార్కెట్ వున్న విష‌యం తెలిసిందే. ఆ సంస్థ అందిస్తున్న హీరో గ్లామ‌ర్ బైక్ కు చ‌ర‌ణ్ ప్ర‌చార క‌ర్త‌గా మారారు. ఈ బ్రాండ్ కు చ‌ర‌ణ్ ఏడాదిన్న‌పాటు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తార‌ని తెలుస్తోంది.

చ‌ర‌ణ్ పై 30 సెక‌న్ల పాటు షూట్ చేసిన ఈ క‌మ‌ర్షియ‌ల్ యాడ్ అత్యంత సాహ‌సోపేతంగా అబ్బుర‌ప‌రిచేలా వుంటుంద‌ట‌. గ‌తంలో రామ్ చ‌ర‌ణ్..అలియాభ‌ట్ తో క‌లిసి 'ఫ్రూటీ', క‌ళాత‌ప‌స్వీ కె. విశ్వ‌నాథ్ తో క‌లిసి 'సువ‌ర్ణ‌భూమి', డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ ప్ర‌చార క‌ర్త‌గా ప‌లు క‌మ‌ర్షియ‌ల్ కంప‌నీల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా వ్య‌వ‌హ‌రించాడు. గ‌త కొంత కాలంగా భారీ బ్రాండ్ ల‌కు దూరంగా వుంటున్న చ‌ర‌ణ్ తాజాగా హీరో గ్లామ‌ర్ బ్రాండ్ తో దూకుడు పెంచిన‌ట్టుగా తెలుస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News