అందుకే మళ్లీ బాలీవుడ్ వైపు వెళ్ళలేదు: సీనియర్ స్టార్ హీరోయిన్

Update: 2020-06-19 00:30 GMT
టాలీవుడ్ సీనియర్ అందాల తార రమ్యకృష్ణ గురించి అసలు తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 1985లో విడుదలైన 'భలే మిత్రులు’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి 1989లో ‘సూత్రధారులు’ సినిమాతో నటిగా మంచి గుర్తింపు పొందింది. కానీ రమ్యకృష్ణకి సరైన అవకాశాలు రాలేదు. ఇక 1992లో అల్లుడుగారు సినిమా విడుదలై ఆమె కెరీర్ ని మలుపుతిప్పింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రమ్యకృష్ణకి రాలేదు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం ఇండస్ట్రీలలో కూడా సినిమాలు చేసింది. దాదాపు సౌత్ ఇండస్ట్రీలలో ఉన్న స్టార్ హీరోలు అందరి సరసన రమ్యకృష్ణ పనిచేసింది. ఇక సౌత్ సినిమాలు చేస్తున్నప్పుడే బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి కూడా పిలుపు రావడంతో అటు వైపు కూడా అడుగులు వేసింది. బాలీవుడ్లో కల్‌నాయక్‌.. క్రిమినల్‌.. శపత్‌.. బడే మియా చోటే మియా వంటి హిట్ సినిమాలతో హిందీ ప్రేక్షకులను కూడా అలరించింది.

అయితే ఇటీవలే ఓ ఆంగ్ల పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్ సినిమాల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయట పెట్టింది. 'నేను హిందీలో కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పుడు చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ నేను వాటి పై సంతకం చేయలేదు. ఎందుకంటే నిజానికి నా సినిమాలు బాలీవుడ్లో సరిగ్గా ఆడలేదు. నాకు వచ్చిన ఆఫర్లు కూడా అంత ఇంటరెస్ట్ అనిపించలేదు. అందుకే హిందీలో ఎక్కువ సినిమాలు చేయలేదు. మరో విషయం ఏంటంటే.. ఆ టైంలో నేను సౌత్ లో స్టార్డం పొందుతున్నాను" అంటూ సమాధానం ఇచ్చింది. ఇక చాలా కాలం తర్వాత బాహుబలి సినిమాతో మళ్లీ హిందీ ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ - విజయ్ దేవరకొండల ఫైటర్ సినిమాలు నటిస్తున్నట్లు తెలిపింది. ఇక ఫైటర్ కూడా తనకు మరో బాహుబలిగా రుజువు చేస్తుందని రమ్యకృష్ణ వెల్లడించింది.
Tags:    

Similar News