రమ్యకృష్ణ.. కెరీర్ ని ఎలా డీల్ చేయాలో.. ఎలా హ్యాండిల్ చేయాలో.. ఎలా కంటిన్యూ చేయాలో.. క్రేజ్ ఎలా కాపాడుకోవాలో రమ్యకృష్ణకి తెలిసినంత పర్ఫెక్ట్ గా ఎవరికీ తెలియదని చెప్పాలి. నిన్నటి తరం స్టార్లతో నటించి, తర్వాతి తరం హీరోతో ఐటెం సాంగ్ చేసి, మళ్లీ అదే హీరోకి అత్తగా నటించడమంటే మమూలు విషయం కాదు. దీనికి ఎంతో తెగువతో పాటు మెప్పించగల సత్తా ఉండాలి. ఇది పుష్కలంగా ఉన్న నటి రమ్యకృష్ణ.
బాహుబలిలో ఈమె చేసిన శివగామి పాత్రతో తన స్థాయి ఏంటో చాటి చెప్పింది. అలాంటి ఈమె.. ఓ కేరక్టర్ లో వేరియేషన్ కోసం జుట్టుకి రంగు వేసుకోమంటే నో అంటుందని ఊహించగలమా? కానీ అదే జరిగింది. సోగ్గాడే చిన్ని నాయన చిత్రంలో నాగార్జునకి తల్లిగా చేయాలని రమ్యని కోరినపుడు ముందు కుదరదని చెప్పిందట. తర్వాత నాగ్ కు భార్యగాను - తల్లిగాను చేయాలని.. ఆమేరకు హీరోకు రెండు పాత్రలు ఉంటాయని చెప్పాక ఓకే చెప్పిందట. అయితే.. తల్లిగా చేసే పాత్ర కోసం హెయిర్ డై వేసుకోవాలంటే మాత్రం మళ్లీ కుదరదని చెప్పేసిందట. డై వెయ్యకపోతే.. మళ్లీ గ్రాఫిక్స్ కు బోలెడు ఖర్చు చేయాల్సి వస్తుందని నాగ్ చెప్పినా.. అదేం అవసరం లేదు.. ఇప్పుడు యంగ్ మదర్ ట్రెండ్ నడుస్తోంది. కలర్ వేయకపోయినా కవర్ చేసేయచ్చని భరోసా ఇచ్చిందట రమ్యకృష్ణ.
దీంతో చివరకు ఆమె చెప్పినట్లుగానే వైట్ హెయిర్ డై వేయకుండానే షూట్ చేశారు. ఏమైనా రమ్యకృష్ణ ట్యాలెంట్ ముందు.. ఇలాంటి డిమాండ్స్ అన్నీ చిన్నబోయాయన్న మాట. తన పంతమే నెగ్గించుకుని, చివరకు నాగ్ కు కూడా యంగ్ మదర్ పాత్రలోనే నటించి మెప్పించేస్తోంది.