కొంతమంది హీరోలు తమకు ఎంత బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా.. బయట ప్రొడ్యూసర్లతోనే సినిమాలు చేస్తుంటారు. వాళ్లు సొంతంగా చేసుకునేవి చాలా తక్కువ. అదే ప్రొడక్షన్ రంగంలో కాకలు తిరిగిన అల్లు ఫ్యామిలీ.. దగ్గుబాటి ఫ్యామిలీ అయితే మాత్రం.. వారికివారే ఎన్నో సినిమాలు తీసుకోగలరు. ఈ మధ్య కాలంలో గీతా ఆర్ట్స్ అల్లు అర్జున్ తో సరైనోడు సినిమాను తీస్తే.. సురేష్ బాబు కొడుకు రానాతో నేనే రాజు నేనే మంత్రి సినిమాను తీశారు. ఈ రెండు సినిమాల గురించి ఒక పాయింట్ చెప్పుకోవాలి.
అప్పట్లో ఒక కార్యక్రమంలో బన్నీ మాట్లాడుతూ.. సరైనోడు సినిమాతో చాలా లాభాలు వచ్చాయి.. కాని మా నాన్నగారు నాకు ఇంకా ఏమీ ఇవ్వలేదు. ఏదన్నా ఇస్తే బాగుంటుంది అంటూ జోక్ వేశాడు. దానికి అల్లు అరవింద్ కూడా నవ్వేశారు. ఆ తరువాత నిన్న నేనే రాజు నేనే మంత్రి సినిమా ఆడియో ఫంక్షన్లో మీ నాన్నగారు నీకు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారు అని రానాను అడిగితే.. ఏమీ ఇవ్వలేదని చెప్పాడు రానా. మరి అడగకపోయావా అంటే.. నేను ఆయన ఇంట్లోనే ఉంటున్నా.. తిండీ తిప్పలు పెట్టడం మానేస్తారు.. ఎందుకొచ్చిందిలే అంటూ జోకేశాడు. అందుకు సురేష్ బాబు కూడా నవ్వేశారు. మొత్తానికి కొడుకులు ఎంతపెద్ద స్టార్లు అయిపోతున్నా కూడా తండ్రులు మాత్రం ఇలా వారిని బ్యాలెన్స్ చేయడం పెద్ద ఆర్టే. చాలామంది ఇది నేర్చుకోవాల్సిందే.
ఇకపోతే కొంతమంది కొడుకులు అయితే తండ్రులకు సంబంధం లేకుండా తండ్రులతో సినిమాలు తీస్తున్నారు. అదిగో మొన్ననే రామ్ చరణ్ అసలు రూపాయి కూడా ఇవ్వకుండా చిరంజీవిని హీరోగా పెట్టి ఖైదీ నెం 150 సినిమాను తీశాడు. తరువాత ధనుష్ కూడా మామయ్య రజనీకాంత్ తో కాలా సినిమాను తీస్తున్నాడు. ఈ సినిమాలకు మన జూనియర్లు ఆ సీనియర్లకు పైసా కూడా ఇవ్వట్లేదట. అది సంగతి.