బాహుబలి షూటింగా? వాళ్లిద్దరూ ఎక్కడ?

Update: 2015-12-16 12:24 GMT
చరిత్ర సృష్టించిన బాహుబలి చిత్రానికి సీక్వెల్ షూటింగ్ మొదలైపోయింది. బాహుబలి ది కంక్లూజన్ షూటింగ్ ని దర్శకధీరుడు రాజమౌళి స్టార్ట్ చేసేశాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అన్నీ పూర్తి చేసేసుకు అధికారికంగానే షూటింగ్ మొదలుపెట్టాడు. ఓ వైపు గ్రాఫిక్ వర్క్ ని చూసుకుంటూ..మరోవైపు షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసి, వచ్చే ఏడాది ఇదే సమయానికి రిలీజ్ చేయాలన్నది జక్కన్న టార్గెట్. ఇంతకీ బాహుబలి ఎవరెవరితో షూటింగ్ స్టార్ట్ చేశాడ?

ఇది చాలా టఫ్ క్వశ్చన్. ఇప్పటికైతే బాహుబలి అవతారంతోనే కంటిన్యూ అవుతూ.. అదే ఫిట్ నెస్ ని కంటిన్యూ చేస్తోంది బాహుబలి హీరో ప్రభాస్ ఒక్కడే. దేవసేన రోల్ చేస్తున్న అనుష్క అయితే.. సైజ్ జీరో కోసం పెంచిన సైజులని కరిగించుకుంటోంది. ఇంకా ఈ ప్రాసెస్ కంటిన్యూ అవలేదు. మరోవైపు ఇలా సన్నబడిపోయినా, ఒకేసారి ముందున్న గ్లామర్ ఉండదు. దాన్ని తెచ్చుకోవాలి. ఇదంతా జరిగాక.. స్వీటీ వెళ్లి సింగం3 షూటింగ్ లో జాయిన్ అయిపోతుంది. అక్కడ దాదాపు 2 నెలలున్నాక.. అప్పుడొచ్చి బాహుబలి ది కంక్లూజన్ షూటింగ్ కి జతవుతుంది అనుష్క. మరోవైపు భల్లాలదేవుడు రాణా సంగతి కూడా ఇలాగే ఉంది. ఈయనైతే బరువు పెరగాల్సి ఉంది. ఇది కాక రీసెంట్ గా స్టార్ట్ చేసిన సబ్ మెరైన్ కాన్సెప్ట్ బేస్డ్ మూవీని ఫినిష్ చేసి, అప్పుడొచ్చి బాహుబలితో ఫైటింగులు మొదలుపెడతాడు.

ఇక సీక్వెల్ లో తమ్మూ రోల్ నామమాత్రమే. చిన్న రోల్ ఉంటుందని మిల్కీబ్యూటే చెప్పింది. అంటే ఇప్పటికైతే ప్రభాస్ ఒక్కడితోనే షూటింగ్ చేసుకోవాలన్న మాట జక్కన్న. మరి ఇలా అయితే.. ఈ మూవీ 2016 చివరకు రావడం అనుమానమే.
Tags:    

Similar News