త్రిషతో రానా.. రెండోసారి

Update: 2017-07-03 13:49 GMT
చెన్నై సోయగం త్రిషతో దగ్గుబాటి హీరో రానాకు లవ్ ఎఫైర్ ఉండేదని టాలీవుడ్ లోనే కాదు.. కోలీవుడ్ లో కూడా టాక్ ఉంది. సుచి లీక్స్ వ్యవహారంలో కూడా వీరిద్దరి పేర్లు ఎక్కువగానే వినిపించాయి. అయితే.. మొదట బాగా డీప్ గా ప్రేమించేసుకున్నారనే టాక్ ఉన్న వీరు.. అంతలోనే ఎందుకో కారణం బైటకు చెప్పకుండానే విడిపోయారు.

అలాగని మాటల తూటాలు.. విసుర్లు.. ప్రచ్ఛన్న యుద్ధాలేమీ లేవు. ఇద్దరూ సొంత కెరీర్ ల కోసం ప్రేమను పక్కన పెట్టేసేందుకు డిసైడ్ అయ్యారని టాక్. అయితే.. చాలా కాలం ఇదే విధంగా కొనసాగిన ఈ జంట..  ఆ తర్వాత ఎపుడూ బైట కలిసి కనిపించలేదు. ఎలాంటి మాటలు వినిపించినా పట్టించుకోలేదు. కానీ ఈ మధ్య మాత్రం ట్రెండ్ మార్చేస్తున్నారు త్రిష అండ్ రానా. రీసెంట్ గా అబుదాబిలో జరిగిన సైమా అవార్డుల వేడుకలో వీరిద్దరూ పక్క పక్కనే కూచుని కబుర్లాడుకున్నారు. అవేమీ అలా రిజర్వేషన్ చేసిన సీట్లు కాకపోవడంతో.. ఉద్దేశ్యపూర్వకంగానే ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారనే విషయం చాలామందికి అర్ధమైంది.

అయితే.. కొన్ని రోజుల క్రితం జరిగిన ఫిలింఫేర్ అవార్డుల వేడుకలో కూడా వీరిద్దరూ ఇలాగే పక్కపక్కనే కూర్చుని కనిపించారు. కొన్ని వారాల వ్యవధిలోనే ఇలా ఇద్దరూ రెండు సార్లు కెమేరాలకు చిక్కడంతో రకరకాల కామెంట్స్ వినిపించేస్తున్నాయి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News