రానా జడ్జిమెంట్ రైట్.. నాన్నది రాంగ్?

Update: 2018-09-10 06:11 GMT
ఒక సినిమా ఫలితాన్ని విడుదలకు ముందే అంచనా వేయడం చాలా కష్టమైన విషయం. కానీ సినిమా ఫేట్ ను రిలీజ్ కు ముందే చెప్పగల వారు కూడా టాలీవుడ్ లో ఉన్నారు. వారిలో సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు ఒకరు. సురేష్ బాబు ఒక కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నా.. ఏదైనా సినిమాను తమ బ్యానర్ పై రిలీజ్ చేసేందుకు అంగీకరించారన్నా ఆ సినిమా ఒక పొటెన్షియల్ హిట్ అని మనం ఫిక్స్ అయిపోవచ్చు.  కానీ ఫిలిం నగర్ లో వినిపిస్తున్న లేటెస్ట్ టాక్ ఏంటంటే సురేష్ బాబు 'C/o కంచరపాలెం' విజయాన్ని అసలు ఊహించలేకపోయారట.

ఈ సినిమా విడుదలకు ఎప్పుడో సిద్ధం అయినప్పటికీ ఎవ్వరూ ఈ సినిమాను కొనేందుకు ముందుకు రాలేదట. ఈ సినిమా నిర్మాతలు ప్రసాద్ లాబ్స్ లో పలుమార్లు  ప్రివ్యూలు వేసినా  ఇలాంటి ఆఫ్ బీట్ సినిమాలను ఎవరూ చూడరని డిస్ట్రిబ్యూటర్లు తమ అభిప్రాయం చెప్పారట.  ఇక రానా దగ్గుబాటి ఈ సినిమా చూడడం తో 'C/o కంచరపాలెం' టీం కు పెద్ద బూస్ట్ వచ్చింది.  సినిమా రానాకు నచ్చడంతో హక్కులు తీసుకొని మంచి హైప్ క్రియేట్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. 

కానీ సినిమా రిలీజ్ కు ముందు సురేష్ బాబు ఈ సినిమా ను ఎవరు చూస్తారని.. జస్ట్ పది థియేటర్లలో రిలీజ్ చేస్తే సరిపోతుందని అన్నారట. కానీ రానా మాత్రం నాన్నగారి అభిప్రాయంతో ఏకీభవించకుండా పట్టుబట్టి మరీ 200 ల థియేటర్ల లో చేయించాడు.  ఇక తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే.
Tags:    

Similar News