మొదటి నుంచి కూడా రానా విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను చేస్తూ వెళుతున్నాడు. పాత్ర కొత్తగా ఉంటే చాలు .. ఆ పాత్ర నచ్చితే చాలు, హీరోగా .. విలన్ గా .. కీలకమైన పాత్రలను చేయడానికి ఆయన ఎంతమాత్రం వెనుకాడరు. అలాంటి రానా 'విరాటపర్వం' సినిమాలో నక్సలైట్ 'రవన్న' పాత్రను పోషించాడు. ఈ సినిమా ఈ నెల 17వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంటులో రానా మాట్లాడాడు.
"మా చిన్నాన్న లేకుండా ఏ శుభకార్యం జరగదు. ఆయన ఈ ఫంక్షన్ కి రావడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. ఇక్కడికి వచ్చిన ఆయన అభిమానులకు కూడా ధన్యవాదాలు అందజేస్తున్నాను. అలాగే సాయిపల్లవి అభిమానులందరికీ వెల్ కమ్ చెబుతున్నాను. ఇక చరణ్ అభిమానులకు ఒక చిన్న విన్నపం ఏమిటంటే .. ఫ్లైట్ మిస్ కావడం వలన చరణ్ హైదరాబాద్ కి చేరుకోలేదు. తన తరఫున నేను సారీ చెబుతున్నాను. ఇక నా ఫ్యాన్స్ తో నేను పర్సనల్ గా తరువాత మాట్లాడతాను.
దర్శకుడు వేణు విషయానికి వస్తే .. తాను పుట్టిన ఊళ్లో .. తన చుట్టూ ఉన్న పరిస్థితులను కథగా మలచుకుని, ఒక భయంకరమైన నేపథ్యంలో అద్భుతమైన లవ్ స్టోరీ చేశారు. ఆ బ్యుటిఫుల్ లవ్ స్టోరీలో బ్యూటీ ఇక్కడే ఉంది. ఆమె నడుస్తూ ఉంటే చాలు పక్కన వెన్నెల తిరుగుతూ ఉంటుంది.
ఈ సినిమాలో సాయిపల్లవిగారు లేకపోతే ఈ సినిమా ఉండేది కాదు. ఇక నిర్మాతల విషయానికి వస్తే ఇలాంటి కథలను సినిమాలుగా తీసే నిర్మాతలు చాలా అరుదుగా ఉంటారు. టెక్నీషియన్స్ అంతా కూడా ఈ కథను మీ హార్ట్ కి దగ్గరిగా వెళ్లేలా పనిచేశారు.
రవన్న దళం సభ్యులుగా ప్రియమణిగారు .. నవీన్ చంద్రగారు నాతో పాటు ఉంటూ అద్భుతమైన పాత్రలను ప్లే చేశారు. ఈ సినిమాలో ఐదు ముఖ్యమై పాత్రలను స్త్రీలు పోషించారని ఇందాక వేణు చెప్పాడు .. ఇది లేడీస్ చూడదగిన సినిమా. పీటర్ గారు నాకు ఎలాంటి గాయాలు కాకుండా ఫైట్స్ ను కంపోజ్ చేశారు.
అందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు చాలామంది వద్దని చెప్పారు. అప్పుడు అర్థమైంది నాకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో. ఒక యాక్టర్ గా ఇక నుంచి మీ కోసం ప్రయోగాలు చేయాలనుకుంటున్నాను .. పిచ్చెక్కించేద్దాం" అంటూ చెప్పుకొచ్చారు.