భళ్లాలదేవ రానా ఓ ఇంటివాడవుతున్న సంగతి తెలిసిందే. తన స్నేహితురాలు.. కాబోయే భార్య మిహీకను ఇటీవలే సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసి సడెన్ షాకిచ్చాడు. మిహీకను పరిచయం చేసిన నిమిషాల్లోనే ఆ వార్త వైరల్ గా మారింది. నిన్నగాక మొన్ననే ఇరు కుటుంబాలు రోకా వేడుక (కుటుంబాల కలయిక) కూడా జరిగింది. ఆ వేడుక నుంచి ఎక్స్ క్లూజివ్ ఫోటోని అక్కినేని కోడలు సమంత సోషల్ మీడియాలో అభిమానులకు షేర్ చేశారు. ఇప్పటికే రానా- మిహీక రోకా వేడుక ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి.
అన్నట్టు అసలు మిహీకతో రానా స్నేహం ఎలా కుదిరింది? ఎప్పుడు లవ్ లో పడ్డాడు? అన్నది తననే అడిగేస్తే ఆసక్తికర సంగతుల్నే చెప్పాడు. `లాక్డ్ అప్ విత్ లక్ష్మి` (ఇన్ స్టా) షోలో లక్ష్మి మంచు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు రానా. మిహీక తనకు చాలా కాలంగా తెలుసునని ఎందుకంటే తన సోదరి దగ్గుబాటి ఆశ్రితకు క్లాస్ మేట్ అని కూడా చెప్పాడు. తనతో చాలా కాలం స్నేహం తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుని లవ్ లో పడ్డారట. అటుపై రానా ప్రపోజ్ చేసిన తీరు కూడా ఇంట్రెస్టింగ్.
ఎవరైనా అబ్బాయికి అమ్మాయి పరిచయం అయితే ముందుగా గులాబీ ఇచ్చో లేదా ఖరీదైన కానుకను ఇవ్వడం ద్వారానో ప్రపోజ్ చేస్తారు. కానీ రానా మాత్రం చాలా డిఫరెంటుగానే ప్రపోజ్ చేశాడు. అతడు నేరుగా మిహీక ఇంటికి వెళ్లి ఆమె తల్లిదండ్రులను కలిసాడట. ఉన్న విషయం కాస్తా చెప్పేశాడట. ఈ ప్రపోజల్ కి అత్తమామలు షాక్ తిన్నారట. ఆ తర్వాత మిహీకను కన్విన్స్ చేసేశాడట. అయితే చాలా కాలం స్నేహం వల్ల ఒకరికొకరు అర్థం చేసుకున్న తర్వాతనే ప్రేమలో పడ్డారని రానా ఇచ్చిన హింట్ రివీల్ చేసింది. అలాగే విక్టరీ వెంకటేష్ కుమార్తె ఆశ్రితకు స్నేహితురాలు కాబట్టే తనకు స్నేహితురాలు అయ్యింది మిహీక. అలా లవ్ కి అన్నివిధాలా కలిసొచ్చిందన్నమాట.