మేమిద్దరమూ సింగిలే అంటున్న రకుల్

Update: 2018-01-27 02:30 GMT
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ లో మన భళ్లాల దేవుడి పేరు ముందే ఉంటుంది. మంచి కండలు, మస్క్యులర్ బాడీతో ఆకట్టుకున్న అతడికి లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. ఇటు టాలీవుడ్ లోనూ.. అటు బాలీవుడ్ లోనూ రానా ఫ్రెండ్స్ లిస్టులో హాట్ హీరోయిన్లు చాలామందే ఉన్నారు. దీనికితోడు హీరోయిన్లతో చెట్టపట్టాలు వేసుకుని తిరగడంలోనూ రానా పేరు ముందే వినిపిస్తుంది.  

టాలీవుడ్ లో రానా క్లోజ్ ప్రెండ్స్ లిస్టులో నార్త్ నుంచి తెలుగులో సెటిలైపోయిన రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఉంది. వీళ్లిద్దరూ డేటింగ్ లో ఉన్నారనే గాసిప్ టాలీవుడ్ లో తెగ చక్కర్లు కొడుతోంది. రకుల్ మాత్రం  అలాంటిదేమీ లేదని.. తామిద్దరం మంచి ఫ్రెండ్సని మొదటి నుంచి రానా పాడుతున్న పాటనే తాను కూడా వినిపిస్తోంది. హైదరాబాద్ లో తన ఫ్రెండ్సందరిలో తాను.. రానా కాకుండా ఇంకొకళ్లిద్దరు మాత్రమే సింగిల్ ఉన్నారని.. అందువల్లనే తామిద్దరికి రిలేషన్ షిప్ అంటగట్టేస్తున్నారని అంటోంది. అయినా ఇలాంటివన్నీ ఇండస్ట్రీలో కామనేనని.. వీటిని చూసినప్పుడల్లా నవ్వుకుని వదిలేస్తామని చెబుతోంది.

తాను చాలాకాలంగా హైదరాబాద్ లో సింగిల్ గానే ఉంటున్నానని.. ఇక్కడ తనకు ఏ చిన్న అవసరం వచ్చినా వెంటనే గుర్తొచ్చే ఫ్రెండ్ రానాయేనంటోంది రకుల్.  తామిద్దరం సింగిల్ గా ఉండటం వల్లనే తమ పేర్లు గాసిప్స్ లో వినిపిస్తాయని రకుల్ చెప్పడం వరకు బాగానే ఉంది కానీ... వాళ్లిద్దరి పేర్లే ఎందుకు కలిపి వినిపిస్తాయో మాత్రం చెప్పడం లేదు.


Tags:    

Similar News