ఆసక్తిరేకెత్తిస్తున్న రానా 'అరణ్య' గెటప్‌

Update: 2019-06-10 05:13 GMT
రానా ప్రస్తుతం త్రి భాష చిత్రంలో నటిస్తున్నాడు. హిందీ, తెలుగు, తమిళంలో రూపొందుతున్న ఈ చిత్రానికి 'హాథీ మేరీ సాధీ'.. 'కాదన్‌'.. 'అరణ్య' అనే టైటిల్స్‌ ను అనుకున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న ఒక సామాజిక అంశం గురించి ఉండబోతుంది. కార్పోరేట్‌ పేరుతో అరణ్యాలను నరికి వేయడం.. కంపెనీలను ఏర్పాటు చేసే పేరుతో అడవులను నరకడం చేస్తున్నారు. ఆ విషయాన్ని ఈ చిత్రంలో చూపించడం జరుగుతుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

అడవులను కార్పోరేట్‌ సంస్థలు నరుక్కుంటూ పోవాలని ప్రయత్నిస్తూ ఉంటే వారికి ఎదురు నిలిచే వ్యక్తి పాత్రలో రానా కనిపించబోతున్నాడు. మద్య వయస్కుడి పాత్రలో రానా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. తెల్ల జట్టు.. తెల్ల గడ్డంతో పాటు కాస్త బట్టతల కూడా ఉండేలా మేకప్‌ ఉండబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. విభిన్నమైన పాత్రలను చేసేందుకు ఎప్పుడు ముందు నిలిచే రానా ఈ చిత్రంలోని పాత్రను చాలా చాలెంజ్‌ గా తీసుకుని చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

యంగ్‌ హీరోలు మిడిల్‌ ఏజ్‌, ఓల్డ్‌ ఏజ్‌ పాత్రలకు ఆసక్తి చూపించరు. కాని రానా మాత్రం ఎలాంటి పాత్రలో అయినా నటించేందుకు సిద్దంగా ఉంటాడు. నటుడిగా నిరూపించుకునేందుకు ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేస్తూ వస్తున్న రానా ఈసారి కూడా మరో విభిన్నమైన గెటప్‌తో ప్రయత్నం చేస్తున్నాడు. ఈ చిత్రంలో ఏనుగులు కీలక పాత్రలో కనిపించబోతున్నాయి. అందుకోసం చాలా రోజుల పాటు ఏనుగులతో రానా కలిసి పోయేందుకు ప్రయత్నించాడు. సినిమాలో హీరో పాత్రకు ఏనుగులు సాయంగా ఉంటాయి. ఏనుగుల సాయంతో కార్పోరేట్‌ కంపెనీల ఆట కట్టిస్తాడు హీరో. ఈ చిత్రం షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుందని తెలుస్తోంది. త్వరలోనే పూర్తి వివరాలు వెళ్లడయ్యే అవకాశం ఉంది.

Tags:    

Similar News