రానా పెళ్లి ఫిక్స్.. త్రిష‌- శ్రీ‌య స్పందించ‌లేదేం?

Update: 2020-05-13 04:00 GMT
యంగ్ హీరో రానా ముంబైకి చెందిన ప్ర‌ముఖ డిజైనర్ మిహికా బ‌జాజ్ ని పెళ్లాడేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆర‌డుగుల రానా హైట్ కి త‌గ్గ‌ట్టే మిహిక క‌టౌట్ కూడా స‌రిగ్గానే కుదిరింద‌ని అత‌డు రిలీజ్ చేసిన‌ ఫోటో చూస్తే అర్థ‌మ‌వుతోంది. మిహిక ప్ర‌స్తుతం వెడ్డింగ్ ప్లాన‌ర్ బిజినెస్ లోనూ బిజీగా ఉన్నార‌ట‌. ఇక ఆమెతో రానాకి ప‌రిచ‌యం ఎలా?  స్నేహం ఎలా కుదిరింది.. ప్రేమాయ‌ణం ఎంత‌కాలంగా ఇవన్నీ కాస్త ఆగితే కానీ తెలీదు.

అయితే రానా త‌న లేడీ ల‌వ్ గురించి సామాజిక మాధ్య‌మాల్లో ఓపెన్ అవ్వ‌గానే స్టార్ల నుంచి శుభాకాంక్ష‌లు వెల్లువెత్త‌డ‌మే కాదు.. కొంద‌రు క‌థానాయిక‌లు అయితే షాక్ తిన్నారు. అలా షాక్ తిన్న వారిలో స‌మంత‌- రాశీ ఖ‌న్నా- ల‌క్ష్మీ ప్ర‌స‌న్న స‌హా ప‌లువురు భామ‌లు ఉన్నారు. వీరంతా సోష‌ల్ మీడియాలో స‌ర్ ప్రైజింగ్ అంటూనే .. విషెస్ తెలిపారు.

``డెడ్… డైడ్...`` అంటూ రానా క‌జిన్.. అక్కినేని నాగ‌చైత‌న్య భార్య‌ స‌మంత సోష‌ల్ మీడియాలో స్పందించారు. రాశీ ఖ‌న్నా అయితే .. వ్వా....ట్‌! అంటూ షాక్ అయ్యి అటుపై తేరుకుని శుభాకాంక్ష‌లు తెలిపింది. హ‌న్సిక‌- రియా చ‌క్ర‌వ‌ర్తి- ప్ర‌గ్య జైశ్వాల్- లావ‌ణ్య త్రిపాఠి- కృతి క‌ర్భంద‌ త‌దిత‌రులు శుభాకాంక్ష‌లు తెలిపారు. అయితే రానా స్నేహితురాళ్ల‌లో త్రిష - శ్రీ‌య త‌దిత‌రులు ఇంకా విషెస్ తెలియ‌జేయ‌లేదు ఎందుక‌నో!

 `శతమానం భవతి` అంటూ రానా పెళ్లి వార్తని కన్ఫామ్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సందర్భంగా రానాతో తన ఫ్యామిలీ మొత్తం కలిసి దిగిన ఫొటోను షేర్ చేసారు.  ``కంగ్రాట్స్ మై బాయ్ రానా .. భల్లాలదేవ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడన్నమాట.. ఈ లాక్ డౌన్ నీకు వెడ్డింగ్ లక్ తీసుకొచ్చింది`` అని కొత్త జంట‌ను ఆశీర్వ‌దించారు.

నిఖిల్ - నితిన్ అతన్ని త‌మ‌ గ్యాంగ్ లో క‌ల‌వాల్సిందిగా కోరారు. ఇప్ప‌టికే ఆ ఇద్ద‌రూ నిశ్చితార్థం కానిచ్చేసి వివాహం కోసం వేచి ఉన్న సంగ‌తి తెలిసిందే. ``భ‌ళ్లా భార్య ఎవరో మాకు తెలిసిపోయింది`` అంటూ బాహుబ‌లి నిర్మాత శోభు యార్ల‌గ‌డ్డ ట్వీట్ చేశారు.  లక్ష్మి మంచు కూడా తన బెస్ట్ బడ్డీకి శుభాకాంక్షలు తెలిపారు. ఉపసనా- దుల్కర్ సల్మాన్ త‌దిత‌రులు రానాకి బెస్ట్ విషెస్ తెలిపారు.

 `శతమానం భవతి` అంటూ రానా పెళ్లి వార్తని కన్ఫామ్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సందర్భంగా రానాతో తన ఫ్యామిలీ మొత్తం కలిసి దిగిన ఫొటోను షేర్ చేసారు.  ``కంగ్రాట్స్ మై బాయ్ రానా .. భల్లాలదేవ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడన్నమాట.. ఈ లాక్ డౌన్ నీకు వెడ్డింగ్ లక్ తీసుకొచ్చింది`` అని కొత్త జంట‌ను ఆశీర్వ‌దించారు.
Tags:    

Similar News