సినీ పరిశ్రమలో దర్శకులుగా మారాలనుకునే కుర్రాళ్లలో కొందరు నేరుగా పెద్ద హీరోల్ని టార్గెట్ చేస్తారు. తొలి సినిమానే పేరున్న వాళ్లతో చేయాలన్న పట్టుదలతో ఎంత కాలమైనా ఎదురు చూస్తారు. ఇంకొందరు చిన్న సినిమా అయినా సరే అవకాశం రాగానే రంగంలోకి దిగిపోతారు. ఆ చిన్న సినిమాతోనే తమ టాలెంట్ చూపించి ఆ తర్వాత పెద్ద అవకాశాలు పట్టేస్తారు. సుధీర్ వర్మ - చందూ మొండేటి లాంటి డైరెక్టర్లు ఇలాగే రెండో సినిమాతో పెద్ద అవకాశాలు అందుకున్నారు. గత ఏడాది ‘అలా ఎలా’ లాంటి చిన్న సినిమాతో సెన్సేషనల్ హిట్టు కొట్టిన అనీష్ కృష్ణ కూడా ఈ జాబితాలోనే చేరుతున్నాడు.
పెద్దగా అంచనాల్లేకుండా విడుదలైన ‘అలా ఎలా’ పెట్టుబడి మీద రెండు మూడు రెట్లు వసూలు చేసి ట్రేడ్ పండిట్స్ ని ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాతో అనీష్ టాలెంట్ ఏంటో కూడా ఇండస్ట్రీకి తెలిసింది. తన తొలి సినిమాకే సీక్వెల్ తీయాలని ఓ దశలో ఆలోచించిన అనీష్.. ఆ తర్వాత ఆ ఆలోచన మార్చుకున్నాడు. అతడి టార్గెట్ పేరున్న హీరోల మీద పడింది. దగ్గుబాటి రానాకు ఓ కథ చెప్పించి ఇంప్రెస్ చేశాడట. కథ వినగానే ఓకే చెప్పేసిన రానా.. ప్రస్తుతం ఉన్న కమిట్ మెంట్లు పూర్తయ్యాక సినిమా చేద్దామని హామీ ఇచ్చాడట. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్ సంస్థే స్వయంగా నిర్మించే అవకాశాలున్నాయి. రానా తెలుగులో పెద్ద స్టార్ కాకపోవచ్చు కానీ.. అతడికి దేశవ్యాప్తంగా మంచి పేరే ఉంది. అతనొకరకంగా నేషనల్ హీరో. అలాంటి వాడితో రెండో సినిమాకు అవకాశం దక్కించుకోవడం అనీష్ అదృష్టమే.