యంగ్ హీరో రానా కాస్త బ్రేక్ తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నాడు. త్వరలో ఈయన అరణ్య అనే మల్టీల్యాంగేజ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇదే సమయంలో విరాట పర్యం చిత్రంలో కూడా ఈయన నటిస్తున్నాడు. వేణు దర్శకత్వంలో రూపొందుతున్న విరాట పర్వం చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా ఇతర సినిమాలతో పాటు హిరణ్యకశ్యప చిత్రం కూడా సెట్స్ పైకి తీసుకు వెళ్లేందుకు రానా సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది.
గుణశేఖర్ దర్శకత్వంలో సురేష్ బాబు ప్రముఖ అంతర్జాతీ నిర్మాణ సంస్థతో కలిసి దాదాపు 100 నుండి 125 కోట్ల బడ్జెట్ తో నిర్మించేందుకు సిద్దం అయ్యారు. షూటింగ్ ప్రారంభంకు అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్ కు ముహూర్తం ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. సమ్మర్ లో ఈ చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నారు. అయితే ఈ సినిమాలోని ఎక్కువ శాతం షూటింగ్ ను వైజాగ్ రామానాయుడు స్టూడియోలో నిర్వహించబోతున్నారు.
ప్రస్తుతం వైజాగ్ రామానాయుడు స్టూడియోలో అందుకు సంబంధించిన సెట్స్ నిర్మాణం జరుగుతోంది. పెద్ద ఎత్తున గుణశేఖర్ అక్కడ సెట్టింగ్స్ ను వేయిస్తున్నాడు. దాదాపుగా ఆరు నెలల పాటు ఆ సెట్టింగ్స్ లోనే చిత్రీకరణ జరుపనున్నారట. మొదట హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడా రామానాయుడు స్టూడియోలో సెట్టింగ్స్ ను ఏర్పాటు చేయాలని భావించారు. కాని ఇటీవలే ఆ స్టూడియోను మూసేయాలని నిర్ణయించుకున్నారు. అక్కడ నుండి స్టూడియో ఎక్యూప్ మెంట్స్ అంతా కూడా వైజాగ్ తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట.
ఈ కారణంగానే హిరణ్యకశ్యప సినిమా షూటింగ్ సగానికి పైగా వైజాగ్ లోని రామానాయుడు స్టూడియోలోనే నిర్వహించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. రానా అభిమానులతో పాటు సినీ వర్గాల వారు ప్రేక్షకులు అంతా కూడా హిరణ్యకశ్యప చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది సమ్మర్ లో పట్టాలెక్కితే వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.