బాహుబలిలో భల్లాలదేవుడిగా నటించిన రానాకి.. అవార్డుల వరద కురుస్తోంది. ప్రతీ అవార్డ్ ఫంక్షన్ లోనూ రానాకి ఓ అవార్డ్ వస్తోంది. బెస్ట్ విలన్ రోల్ కి ఈ దగ్గుబాటి వారసుడినే అందరూ ఎంపిక చేస్తున్నారు. దీంతో రానా కూడా ఫుల్లు హ్యాపీగా ఉన్నాడు. అవార్డ్ ఫంక్షన్స్ లో తన ఆనందాన్ని ఆన్ స్క్రీన్ పైనే ప్రకటిస్తున్నాడు. రీసెంట్ గా సైమా అవార్డ్ ఫంక్షన్ లో.. అల్లు అరవింద్ చేతుల మీదుగా బెస్ట్ విలన్ అవార్డును అందుకున్నాడు రానా. ఈ సందర్భంగా అల్లు గురించి రానా చేసిన కామెంట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి.
'ఈ అవార్డు మీ చేతుల మీదుగా అందుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీరు నాకు రియల్ లైఫ్ లో విలన్' అంటూ షాక్ ఇచ్చిన రానా మెగాస్టార్ చిరంజీవి వైపు తిరిగి చూసి.. అప్పుడు మళ్లీ తన కామెంట్స్ కంటిన్యూ చేశాడు. 'మా చిన్నపుడు చరణ్ ఎప్పుడూ మీకు భయపడలేదు. అలాగే నేను మా నాన్నకు భయపడిందీ లేదు. కానీ మేమిద్దరం అరవింద్ గారంటే వణికిపోయే వాళ్లం. ఓ క్లాస్ కి బంక్ కొట్టినా.. ఎగ్జామ్ ఎగ్గొట్టినా ఆయనకు తెలిసిపోయేది. ఆ విషయాన్ని అందరికీ తెలిసేలా చేసేవారు అరవింద్' అంటూ వివరించాడు రానా.
చిన్నపుడు తాము చేసిన తప్పులను అందరికీ చెప్పేసి ఎండ గట్టేయడంతో.. అప్పట్లో అల్లు అరవింద్ విలన్ గా కనిపించేవాడట. అలాంటిది ఇప్పుడు ఆయన చేతుల మీదుగా అవార్డ్ అందుకోవడం అంటే.. కచ్చితంగా ఆనందించే విషయమే కదా.