అంతకుముందు దాదాపు నాలుగు సినిమాలు చేసినా కూడా బాలీవుడ్ లో పెద్దగా పేరు రాలేదు కాని.. ఒక్క బాహుబలి దెబ్బతో రానా దగ్గుబాటి అక్కడ కూడా సూపర్ స్టార్ అయిపోయాడనే చెప్పాలి. పెద్దగా అవకాశాలను అయితే అందిపుచ్చుకోలేదు కాని.. మనోడు మాత్రం బాలీవుడ్డోళ్ళ నోళ్ళలో నానిపోతున్నాడంతే. అక్కడి మ్యాగజైన్లన్నీ రానా ఫోటోషూట్ల కోసం ఎగబడుతున్నాయి కూడా.
తాజాగా వస్తున్న మ్యాగ్జిమ్ మ్యాగజైన్ స్పెషల్ ఎడిషన్ పైన ఇప్పుడు రానా మెరుస్తున్నాడు. ఈ ఎడిషన్లో ఇతర హాట్ మోడల్స్ తో కలసి మనోడు తన ఫ్యాషన్ స్టేట్మెంట్ కు కారణం ఏంటో చెబుతాడట. ఆ కవర్ పేజీ మీద చూడండి.. బాహబలి సినిమాలో తనకు ఎలాగో ఒక హీరోయిన్ ను తగిలించి అసలు రొమాంటిక్ అనేదే పెట్టలేదు కాబట్టి.. ఇప్పుడు ఈ కవర్ పై ఇద్దరి భామలతో చిరులొలికిస్తూ ఫోజులు ఇస్తున్నాడు. ఆ భామలు కూడా కవర్ పేజీపై ఇలా ఉన్నారు కాని.. లోపల మాత్రం రెచ్చిపోతారంటలే.
ఏప్రియల్ 28న బాహుబలిః ది కంక్లూజన్ విడుదలవుతున్న సందర్భంగా.. ఇప్పుడు రానా ఇలా కవర్ పేజీల మీద మెరుస్తుంటే.. సినిమాకు హైప్ తేవడానికి ఇవ్వన్నీ బలే ఉపయోగపడుతున్నాయనే చెప్పాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/