ఈమద్య కాలంలో సెల్రబెటీలు ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ ఛానెల్స్ ను కలిగి ఉంటున్నారు. వారి వారి రోజు వారి జీవితంలో ఏం జరుగుతుంది.. ఎలా షూటింగ్ లు చేస్తున్నాం.. ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం అనే విషయాలను తెలియజేసేందుకు గాను యూట్యూబ్ ఛానెల్ ను ఎంచుకుంటున్నారు. తమ వ్లాగ్స్ ను ప్రేక్షకులకు అందించడంతో పాటు అంతో ఇంతో ఆదాయం కూడా వస్తుందనే ఉద్దేశ్యంతో సెలబ్రెటీలు సొంత ఛానెల్స్ ను ప్రారంభిస్తున్నారు. చాలా మంది దారిలో రానా కూడా ఒక యూట్యూబ్ ఛానెల్ ను తీసుకు రాబోతున్నాడు. అయితే ఇది ఆయన వ్యక్తిగత యూట్యూబ్ ఛానెల్ కాకుండా ఒక ఓటీటీ మాదిరిగా పని చేయబోతుందట.
'సౌత్ బే' అనే పేరుతో రానా ప్రారంభించిన యూట్యూబ్ ఛానెల్ లో 10 సెకన్ల వీడియో నుండి 10 గంటల వీడియో వరకు అన్నింటికి అనుమతి ఉంటుంది. క్రియేటివిటీ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది మంచి ప్లాట్ ఫామ్ కాబోతుంది అంటూ ఆయన ప్రకటించాడు. ఫన్.. న్యూస్.. యానిమేషన్.. ఫిక్షన్ ఇలా అన్ని రకాల కథలతో వీడియోలను మరియు పాటలను ఇలా అన్ని రకాలుగా వీడియోలను తమ ఛానెల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లేందుకు సిద్దంగా ఉన్నట్లుగా రానా ప్రకటించాడు. రానా తీసుకు రాబోతున్న సౌత్ బే యూట్యూబ్ ఛానెల్ ఒక చిన్న తరహా ఓటీటీ గా నిలిచే అవకాశం ఉంది అంటున్నారు.