వంద సినిమాలకు పైగా నిర్మాణం చేసి అన్ని భాషల్లోనూ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ ఇంతకు ముందున్నంత దూకుడగా లేదన్నది వాస్తవం. చాలా సెలెక్టివ్ గా ఇతర సంస్థలతో కలిసి మంచి కథ దొరికినప్పుడు మాత్రమే సినిమా నిర్మిస్తోంది. ఇది సురేష్ బాబుతో సహా ఇప్పటిదాకా అందరు సీనియర్ ప్రొడ్యూసర్లు ఫాలో అవుతున్న పద్దతే. కానీ ఈ ట్రెండ్ కి భిన్నంగా నిర్మాణం పూర్తయ్యి విడుదలకు ఇబ్బంది పడుతున్న మంచి సినిమాలకు చేయూత ఇవ్వడం అనే కొత్త సంప్రదాయానికి సురేష్ బాబు పెళ్లి చూపులుతో శ్రీకారం చుడితే ఇప్పుడు కేరాఫ్ కంచరపాలెంతో రానా దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. ఇది తాము పెట్టుబడి పెట్టిన సినిమా కాదు. ప్రవీణ్ పరుచూరి అనే ఎన్ ఆర్ ఐ కార్డియాలజిస్టుతో పాటు మరికొందరు పార్టనర్స్ గా మారి తీశారు. మహా అంటే కోటి రూపాయల లోపే పెట్టుబడితో దీన్ని పూర్తి చేసారు. కానీ ఇంత బాగా వచ్చిన సినిమాను జనంలోకి తీసుకెళ్లే పద్ధతి థియేటర్లకు అమ్మడం లాంటి వ్యవహారాలు అలవాటు లేనివి కావడంతో రానాను కలిసి సినిమా చూపించారు.
అంతే సీన్ మొత్తం మారిపోయింది. ఎప్పుడైతే సమర్పకుడిగా రానా పేరు తొడయ్యిందో పోస్టర్ల మీద సురేష్ బ్యానర్ లోగో కనిపించిందో ప్రేక్షకులు దీని వైపు చూడటం మొదలుపెట్టారు. దానికి తోడు రానా సురేష్ లు తమ నెట్వర్క్ ను ఉపయోగించి మీడియాతో పాటు ఇండస్ట్రీ ప్రముఖులకు ఇప్పటికే చాలా ప్రీమియర్ షోలు వేశారు. ఒక్క నెగటివ్ పదం కూడా బయటికి రాలేదు. కట్టిపడేసేలా సినిమా ఉందనే మౌత్ టాక్ మీడియా ప్రతినిధులతో పాటు సెలబ్రిటీలు సైతం ట్విట్టర్ లో దీనికి మద్దతు ఇవ్వడంతో చిన్న సినిమాల్లో పెద్ద సినిమా అనే క్యాప్షన్ ను కేరాఫ్ కంచరపాలెం సార్థకం చేసుకుంటోంది. ఇది ఒరిజినల్ గా సినిమా తీసిన వాళ్లకు సపోర్ట్ చేసి బిజినెస్ అయ్యేలా చూసిన సురేష్ కాంపౌండ్ కు మంచి చేసేదే. గతంలో దిల్ రాజు సైతం వెళ్ళిపోమాకే అనే సినిమాను ఈ ఉద్దేశంతోనే తీసుకున్నారు కానీ సరైన ప్రమోషన్ లేని కారణంగా అది జనానికి చేరలేదు. కానీ కేరాఫ్ కంచరపాలెంకు అన్ని కుదిరేలా చాలా ప్లాన్ తో వెళ్లారు రానా సురేష్ లు.