ఆ ముగ్గురు Rల‌తో ముంబైలో ప్ర‌త్య‌క్ష‌మైన R

Update: 2021-12-22 12:30 GMT
ఆ ముగ్గురితో భ‌ళ్లాలదేవ ముంబైలో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాడు. అలా తీరిక వేళ స‌ర‌దాగా జోక్స్ వేస్తూ రిలాక్స్ డ్ గా న‌వ్వుకుంటూ ఆ న‌లుగురు క‌నిపించారు ఆ స‌న్నివేశంలో. ఇంత‌కీ భ‌ళ్లాలుడికి అక్క‌డేం ప‌ని? అంటే.. అత‌డు ప్ర‌స్తుతం హిందీ ప్ర‌మోష‌న్స్ కి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా మారాడ‌ని అర్థ‌మ‌వుతోంది. ఓ వైపు చ‌ర‌ణ్‌.. తారక్.. రాజ‌మౌళి (ముగ్గురు ఆర్ లు) ఎవ‌రి ప‌ని వారు చేస్తున్నారు. మీడియా ఇంట‌ర్వ్యూల‌తో బిజీ అయ్యారు.  ఫైర్ యాడెడ్ టు ద పెట్రోల్ అన్న చందంగా భ‌ళ్లాలుడు స్నేహితుల బృందంతో ఎంట్రీ ఇచ్చాడు.

స్వతహాగా బాహుబ‌లి స్టార్ గా రానా దగ్గుబాటి అలా క‌నిపించేస‌రికి ఎంద‌రికో ఎన్నో సందేహాలు. కానీ అన్నిటికీ స‌మాధానంగా నిలుస్తోంది ఈ ఫోటోగ్రాఫ్‌. అద్భుతమైన ప్రతిభావంతుల‌తో క‌లిసి నేటి ఉదయం రానా అలా గడిపాడు. ముంబైలో RRR బృందంతో త‌న విలువైన స‌మ‌యాన్ని గడిపాడు. దర్శకుడు SS రాజమౌళి .. జూ.ఎన్టీఆర్ -రామ్ చరణ్ తేజ్.. ల‌తో రానా బాల్కనీలో కెమెరాకు పోజులు ఇస్తూ నవ్వులు పంచుకుంటున్నారు.  RRR లోగోతో స్వెట్ ష‌ర్ట్స్ ధరించిన SS రాజమౌళి రామ్ చరణ్ తేజ్ లు ప్ర‌త్యేకంగా క‌నిపిస్తున్నారు. క్యాప్షన్ లో రానా దగ్గుబాటి త‌దుప‌రి చిత్రం అతని స్వంత ఇనిషియల్ ను సూచిస్తూ.. ముంబయి మార్నింగ్ విత్ ది మైటీ ఆర్స్... ఆర్‌.ఆర్‌.ఆర్ విత్ ఆర్.. అని దీనికి ఇంట్రెస్టింగ్ క్యాప్ష‌న్ రాశారు.

SS రాజమౌళి భారీ విజయవంతమైన ఫ్రాంచైజీ బాహుబలి రెండు భాగాలలో రానా దగ్గుబాటి ప్రధాన ప్రతినాయకుడు. అత‌డి క‌ల‌యిక ఆస‌క్తిని క‌లిగిస్తోంది. తాజా పోస్ట్ కు ప్రత్యుత్తరం ఇస్తూ.. వ్యాపారవేత్త ..రామ్ చరణ్ తేజ్ భార్య ఉపాసన కామినేని కొణిదెల ``వేర్ ఈజ్ మై రైమ్ RRRR`` అనే క్యాప్షన్ ఇచ్చారు.

SS రాజమౌళి దర్శకత్వం వహించిన RRR చిత్రం 7 జనవరి 7 2022న థియేటర్లలో విడుదల కానుంది. అభిమానుల ఆనందానికి చిత్ర తారాగణం కొన్ని తెరవెనుక అప్ డేట్ లు .. పోస్ట్ లను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇటీవల ఈ చిత్రంలో కొమరం భీమ్ పాత్రను పోషిస్తున్న జూనియర్ ఎన్టీఆర్.. మూవీ మేకింగ్ .. అతని పాత్రను వీడియో రూప‌కంగా పంచుకున్నారు. క్యాప్షన్ లో RRR సినిమా కోసం భీమ్ మేకింగ్ వీడియో అని రాశాడు. మరొక సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ముంబైలో ప్రమోషన్ల మధ్య విరామం సమయంలో సహనటుడు రామ్ చరణ్ తేజ్ తో నవ్వుల్ని పంచుకున్న ఒక స్పష్టమైన చిత్రాన్ని పోస్ట్ చేశాడు. ``తెరవెనుక బ్రోమాన్స్... ముంబైలో RRR రోర్ కోసం సిద్ధమ‌వుతోంది`` అని తెలిపాడు.  అలాగే రామ్ చరణ్ తేజ్ కూడా అల్లూరి సీతారామ రాజు పాత్రకు సంబంధించిన మేకింగ్ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. ఈ వీడియోల‌న్నీ వైర‌ల్ గా మారాయి. 1920లో జరిగిన రియ‌ల్ స్టోరీకి ఫిక్ష‌న‌ల్ పాత్ర‌ల‌ను జోడించి RRR తెర‌కెక్కించ‌రు. ఇందులో అలియా భట్- అజయ్ దేవగన్-ఒలీవియా- శ్రియా శరణ్ ముఖ్య పాత్రల్లో నటించారు.
Tags:    

Similar News