సెల్ఫీ ప్లీజ్ అన్న రణ్ బీర్.. ఛీపో అన్న హీరోయిన్!

Update: 2021-01-09 00:30 GMT
'రణ్‍ బీర్‍ కపూర్‍.. ' ఈ హ్యాండ్సమ్ హీరో అంటే అమ్మాయిలు పడి చచ్చిపోతారు. అమ్మాయిలే కాదు.. హీరోయిన్లకు కూడా మనోడు రాకుమారుడే! ఈ విషయం రణ్ బీర్ లవ్ ట్రాక్ లిస్ట్ పరిశీలిస్తే ఇట్టే అర్థమవుతుంది. కత్రినా, దీపిక, ఆలియా… ఇలా బీటౌన్ టాప్‍ హీరోయిన్స్ తో ప్రేమకావ్యాలు రచించాడు మన సుందరాంగుడు.

నిజానికి మనోడి సమ్మోహన రూపం అలాంటిది మరి. అందుకే అమ్మాయిల నుంచి సెలబ్రిటీల వరకూ లైక్ చేస్తుంటారు. అయితే.. అలాంటి రణ్‍ బీర్‍ కపూర్‍ని.. ఒక హీరోయిన్‍ ఛీ కొట్టిందంటే మీరు నమ్ముతారా? నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. అయితే.. ఇది వేరే ఎవరో చెబితే గాసిప్ అనుకోవచ్చు. కానీ.. స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు రణ్ బీర్.

హాలీవుడ్‍ నటి నటాలీ పోర్ట్మన్‍ అంటే రణ్‍ బీర్‍కి చాలా ఇష్టమట. ఒకసారి అమెరికా వెళ్లిన మన హ్యాండ్సమ్ బాయ్.. న్యూయార్క్ వీధుల్లో పచార్లు చేస్తున్నాడట. అప్పుడే అటువైపుగా ఓ బ్యూటీఫుల్ లేడీ వస్తోంది. కళ్లు నలుపుకొని చూస్తే.. తనకు ఎంతో ఇష్టమైన హీరోయిన్ నటాలీ. ఇంకేముంది? ఆనందంతో వెంటనే పరిగెత్తుకెళ్లి సెల్ఫీ ప్లీజ్ అన్నాడట.

ఎలాంటి మూడౌట్ లో ఉందో తెలియదుగానీ.. చిర్రెత్తుకొచ్చిన ఇంగ్లీష్ హీరోయిన్.. 'గెట్‍ లాస్ట్ యూ...' అని బ్రహ్మానందాన్ని తిట్టినట్టు తిట్టేసిందట! ఇదేంటీ? ఇలా జరిగిందని అనుకున్న మనోడికి తర్వాత గానీ విషయం అర్థం కాలేదట.

తాను ఫొటో దిగుదామని అడిగిన సమయంలో పాపం.. ఆ ఆంగ్ల హీరోయిన్ ఏడుస్తోందట! ఏం బాధలో ఉందో ఏమో పాపం. అది చూసిన మనోడు కారణం ఇదా.. అని సర్దిచెప్పుకున్నాడట. అయితే.. ఇంత జరిగినా, పట్టు వదిలేదంటున్నాడు రణ్ బీర్. ఒకసారి ఛీ కొట్టినా సరే.. తనతో ఫొటో సంపాదిస్తానని శపథం చేస్తున్నాడు. మళ్లీ ఈసారి కనపడనీయండి.. ఫొటో దిగకపోతే అప్పుడు అడగండి అంటున్నాడు ఈ బాలీవుడ్ హ్యాండ్సమ్.

అయితే.. అతడిని ఛీ కొట్టిందంటే అప్పటికి మనోడు పాపులర్ హీరో కాలేదని అనుకుంటున్నారా? అదేం కాదు.. అప్పటికే సూపర్‍స్టార్‍ అయిపోయాడు రణ్ బీర్. అయినప్పటికీ.. మన హీరోను మరో లాంగ్వేజ్ హీరోయిన్ గుర్తు పట్టలేదంటే ఆలోచించాల్సిన విషయమే. చూస్తుంటే.. మనోళ్లు ఇంకా ఫేమస్ అయిపోవాల్సిన అవసరం గట్టిగనే ఉన్నట్టుంది. ఏమంటారు..?
Tags:    

Similar News