బాలీవుడ్ మూవీ 'యే దిల్ హై ముష్కిల్' థియేటర్లలో బాగానే ఫేర్ చేస్తోంది. ఇప్పటికే ఈ ఏడాదిలో రిలీజ్ అయిన సినిమాల్లో తొలి రోజు బిగ్గెస్ట్ గ్రాసర్స్ లో చోటు కూడా సంపాదించేసిన ఈ సినిమాకి టాక్ కూడా సూపర్బ్ గానే ఉంది. మరోవైపు.. హీరో రణబీర్ కపూర్ తో పాటు హీరోయిన్స్ ఐశ్వర్యారాయ్- అనుష్క శర్మ.. డైరెక్టర్ కరణ్ జోహార్ లు కూడా ప్రమోషన్స్ లో వేగం పెంచడంతో.. అంతకంతకూ సినిమా రేంజ్ పెరిగే ఛాన్సులు కనిపిస్తున్నాయి. అయితే.. ఇప్పుడు ఐశ్వర్యారాయ్ తో చేసిన ఇంటిమేట్ సీన్స్ పై రణబీర్ కపూర్ చేసిన కామెంట్స్ అందరినీ షాక్ కి గురి చేశాయి.
'టీనేజ్ క్రష్ ఐశ్వర్యారాయ్ తో అలాంటి సీన్స్ చేయడమంటే ముందు చాలా సిగ్గేసింది. చేతులు వణికిపోయాయ్ కూడా. ఆమె బుగ్గలను తాకడానికి కూడా ఇబ్బంది పడిపోయాను. అయితే.. మనం యాక్టింగ్ చేస్తున్నామంతే అంటూ ఐశ్వర్యారాయ్ గుర్తు చేసి హెచ్చరించడంతోనే ఆ సీన్స్ చేయగలిగాను' అని చెప్పిన రణబీర్ కపూర్.. ఆ తర్వాత అసలు సంగతి చెప్పాడు. వివాదం కూడా అక్కడే మొదలైంది.
'ఐశ్వర్యారాయ్ అలా చెప్పాక.. ఇలాంటి ఛాన్స్ మళ్లీ దొరకదు అనిపించింది. అందుకే అవకాశం దొరగ్గానే కుమ్మేశా' అనేశాడు రణబీర్ కపూర్. ఈ కామెంట్ బచ్చన్ ఫ్యామిలీని ఇబ్బంది పెడుతోందని అంటున్నారు బాలీవుడ్ జనాలు. బచ్చన్ ఫ్యామిలీలో నలుగురు ప్రొఫెషనల్ యాక్టర్స్ ఉండడంతో.. సినిమా కోసం ఎలా చేసినా దాన్ని సీరియస్ గా తీసుకోకపోవచ్చు కానీ.. ఇలా ఆఫ్ స్క్రీన్ లో కామెంట్స్ చేయడం మాత్రం కరెక్ట్ కాదనే వాదన వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/