ఆ హీరోయిన్ ను తొలిసారి తాకిన‌ప్పుడు!

Update: 2016-11-05 11:30 GMT
'ఎ దిల్ హై ముష్కిల్’ చిత్రంలో త‌న‌కంటే ప‌దేళ్లు చిన్న‌వాడైన ర‌ణ్‌బీర్ క‌పూర్ తో రొమాన్స్ చేసింది ఐశ్వ‌ర్యారాయ్‌. తెర మీద ఈ ఇద్ద‌రి కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింద‌ని ప్రేక్ష‌కులు చెబుతున్నారు. అయితే, తొలిసారిగా ఐశ్వ‌ర్యారాయ్ ప‌క్క‌న న‌ట‌న అన‌గానే మొద‌ట్లో ర‌ణ్ బీర్ క‌పూర్‌కు టెన్ష‌న్ ప‌ట్టుకుంద‌ట‌! ఐష్ తో న‌టించిన అనుభ‌వాల గురించి ర‌ణ్ బీర్ చెప్పాడు. ఈ సినిమా ఆఫ‌ర్ త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన‌ప్పుడు... హీరోయిన్ గా ఐశ్వ‌ర్యారాయ్ న‌టిస్తోంద‌ని చెప్పగానే ర‌ణ్‌బీర్ ఎగిరి గంతేశాడ‌ట‌! కానీ, నిజంగానే త‌న ప‌క్క‌న ఐశ్వ‌ర్య న‌టిస్తుందా అనుకున్నాడ‌ట‌. లేదు, బాబూ నీ ప‌క్క‌న ఐశ్వ‌ర్యారాయ్ హీరోయిన్ గా న‌టిస్తోంద‌ని ద‌ర్శ‌కుడు క‌ర‌ణ్ జోహార్ ఒక‌టికి రెండుసార్లు చెప్పిన త‌ర్వాతే న‌మ్మాడ‌ట‌. అయితే, అక్క‌డి నుంచీ ర‌ణ్ బీర్‌కు అస‌లు టెన్ష‌న్ మొద‌లైంద‌ని చెప్పాడు.

ఎందుకంటే, ఐశ్వర్యారాయ్ హీరోయిన్ గా మాంచి ఫామ్ లో నటిస్తున్న‌ప్పుడు ర‌ణ్ బీర్ స్కూల్లో చదువుకుంటూ ఉండేవాడు. అంతేకాదు, ‘అబ్ లోట్ చ‌లే’లో ఐశ్వ‌ర్య హీరోయిన్ గా చేస్తుంటే... అదే చిత్రానికి రణ్ బీర్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఆ సినిమా షూటింగ్ లో ఆమెను అలా చూస్తూ ఉండిపోయేవాడ‌ట‌! అయితే, అలాంటి ఐష్ త‌న ప‌క్క‌న హీరోయిన్ గా న‌టించ‌డమంటే అంటూ కాస్త భ‌య‌ప‌డుతూనే తొలిరోజు సెట్‌కి వెళ్లాన‌ని ర‌ణ్ బీర్ చెప్పాడు. ‘ఐశ్వర్యారాయ్ ని తొలిసారి టచ్ చేయగానే చెమటలు పట్టేశాయి. ఆమె ద‌గ్గ‌ర‌కి వ‌స్తుంటే నాకు చేతులు వ‌ణికిపోతూ ఉండేవి’ అని ర‌ణ్ బీర్ అన్నాడు. త‌న టెన్ష‌న్ చూసి ‘చిన్న‌పిల్లాడిలా ఇలాంటి వేషాలు మానుకో. సీన్ లో స‌రిగా న‌టించు’ అని ఐష్ త‌న‌కు ధైర్యం చెప్పింద‌ని అన్నాడు. ఆ త‌రువాత‌, కాన్ఫిడెన్స్ పెరిగింద‌నీ, రెగ్యుల‌ర్ హీరోయిన్ల ప‌క్క‌న ఎలా చేస్తానో అలానే న‌టించాన‌ని చెప్పాడు. ‘ఆమె నా కంటే వ‌య‌సులో పెద్ద‌, అంత‌కుమించిన స్టార్ హీరోయిన్ - అయినాసరే - అలాంటి భేషజాలేవీ ఆమెకి లేవు. ఎంతో ఫ్రెండ్లీగా నాతో న‌టించింది’ అంటూ ఏ దిల్ షూటింగ్ ముచ్చ‌ట్ల‌ను పంచుకున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News