మున్నాభాయ్ ఎంబీబీఎస్ తో బాలీవుడ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ.. ఆ సినిమాతో తనకు బాలీవుడ్ లో గొప్ప చాన్స్ ఇచ్చిన సంజయ్ దత్ ను ఆయన ఎప్పటికీ మరిచిపోలేదు. అందుకే తనకు ఎన్ని హిట్స్ వచ్చినా కూడా సంజూపై ప్రేమను మాత్రం చాటుతూనే ఉంటాడు. . ఇటీవలే సంజయ్ దత్ జీవితగాథ ఆధారంగా ‘సంజూ’ మూవీ తీశాడు. అది హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. రణబీర్ కపూర్.. సంజు పాత్రలో ఇరగదీశాడు. ఇప్పుడా సినిమా తర్వాత హిరానీ ఏం తీస్తాడనేది ఆసక్తిగా మారింది.
రాజ్ కుమార్ హిరాణీ ప్రస్తుతం మరోసారి సంజయ్ దత్ తో జోడి కట్టాడు. ‘మున్నాభాయ్’ సినిమా సిరీస్ లో మూడో సినిమా తీయడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రంలోనూ సంజయ్ దత్ నే హీరోగా ఎంచుకున్నాడు. అయితే ఆశ్చర్యకరంగా మున్నాభాయ్ సినిమాల్లో సంజయ్ కు సపోర్టింగ్ శిష్యుడి పాత్రలో అర్షద్ వార్సి నటించేవాడు. ఇప్పుడు తీసే మూడో సినిమాలో అర్హద్ ను తప్పించి ఈసారి అగ్రహీరోను తీసుకుంటున్నారు.
తొలిరెండు భాగాల్లో సంజయ్ కు అసిస్టెంట్ గా అర్షద్ కనిపించారు. మూడో సినిమాలో మాత్రం అర్షద్ పాత్రలో ఈసారి రణబీర్ కపూర్ ను తీసుకుంటున్నారట. ఇటీవలే సంజు సినిమాతో తనకు గ్రాండ్ హిట్ ఇచ్చిన హిరాణీకి కృతజ్ఞతగానే ఈ పాత్ర చేయడానికి రణబీర్ ఒప్పుకున్నాడట.. అగ్రహీరో అయ్యిండి సంజయ్ దత్ కు అసిస్టెంట్ హీరోగా చేయడానికి రణబీర్ ఒప్పుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ‘మున్నాభాయ్ చలో అమెరికా’ పేరుతో తీసే ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుందనే ప్రచారం జరుగుతోంది.