కరోనా తర్వాత నితిన్ దే హవా అంటున్నారే!

Update: 2020-04-01 02:30 GMT
కరోనా వైరస్ విజృంభణ కారణంగా ఇప్పుడు సినిమా షూటింగులు అన్నీ ఆగిపోయాయి కానీ కాస్త పరిస్థితి సద్దుమణగిన తర్వాత అన్నీ సినిమాలు మళ్ళీ పట్టాలెక్కుతాయి. కొత్తగా సెట్ అయ్యే ప్రాజెక్టులకు కాస్త సమయం  పట్టే అవకాశం ఉంది కానీ ఇప్పటికే ఫిక్స్ అయిన ప్రాజెక్టులు మాత్రం దాదాపుగా సెట్స్ పైకి వెళ్లడం ఖాయం.  టాలీవుడ్ లో ఉన్న మీడియం రేంజ్ హీరోలలో చూసుకుంటే నితిన్ కు సూపర్ లైనప్ ఉంది.

ఈ మధ్యే 'భీష్మ'  సినిమాతో సూపర్ హిట్ సాధించిన నితిన్ చేతిలో ఇప్పుడు మొత్తం నాలుగు సినిమాలు ఉన్నాయి. వాటిలో రెండు సినిమాలు 'భీష్మ' రేంజ్ విజయాలు సాధిస్తే నితిన్ తెలంగాణా పవర్ స్టార్ అయి పోవడం ఖాయమని అంటున్నారు. నితిన్ సినిమాల్లో వెంకీ అట్లూరి దర్శకత్వం లో తెరకెక్కుతున్న 'రంగ్ దే' పైన..అలాగే  కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కనున్న మరో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి.  నితిన్ కు హిట్ దక్కిన ప్రతిసారి నిరూపితమయ్యే విషయం ఏంటంటే రొమాంటిక్ కామెడీలు చేసినప్పుడే ప్రేక్షకులు ఎక్కువగా నితిన్ ను ఆదరించారు. అయితే మాస్ సినిమాల బాటపడితే మాత్రం  నితిన్ ను ఎవరూ కాపాడలేరని అంటున్నారు.

నితిన్ కు ప్రస్తుతం ఉన్న లైనప్ అంతా డిఫరెంట్ గానే ఉంది. నితిన్ కు పెద్దగా సూట్ కాని మాస్ జోనర్ సినిమా ఒక్కటి కూడా లేదు.  వెంకీ అట్లూరి..కృష్ణ చైతన్య సినిమాలు లవ్ స్టోరీలు కాగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం లో తెరకెక్కుతున్న మరో సినిమా డిఫరెంట్ జోనర్. మేర్లపాక గాంధీ దర్శకత్వం లో తెరకెక్కనున్న 'అంధా ధున్' రీమేక్ కూడా డిఫరెంట్ సబ్జెక్టే.  నితిన్ లైనప్ చూస్తే ఎలాంటి హీరోకయినా అసూయ కలగడం ఖాయం.
Tags:    

Similar News