రైట్ ప్లేసుకు వెళ్తున్న రంగస్థలం..

Update: 2018-06-11 04:37 GMT
సినిమా బడ్జెట్లు పెరుగుతున్న కొద్దీ మనోళ్ళు కొత్త కొత్త మార్కెట్లను వెతకడం మొదలెట్టేశారు. ఒకప్పుడు కేవలం హిందీ సినిమాలో ఉత్తరాది రాష్ట్రాల్లో ఆడితేనే ఆడినట్లు. ఇప్పుడు మాత్రం.. ఓవర్సీస్ లో సౌత్ లో కూడా ఆడేస్తున్నాయి. సాక్షాత్తూ హాలీవుడ్ సినిమాలో వారంముందుగా ఇండియాలో ఓ నాలుగు బాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఇక తెలుగు వారు తక్కువకాదులే. మన సినిమాలను కూడా హిందీలో రిలీజ్ చేస్తున్నారు. మలయాళంలో ఆడిస్తున్నారు. ఇప్పుడు మరో కొత్త మార్కెట్ ను కూడా ఓపెన్ చేయబోతున్నారు.

రామ్ చరణ్‌ మరియు సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం సినిమా ఎంతగా ఇంప్రెస్ చేసిందంటే.. ఏకంగా తెలుగు రాష్ట్రాల్లో అండ్ ఓవర్సీస్ లో కలుపుకుని మొత్తంగా 125+ కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ రేంజులో హిట్టయిన సదరు సినిమాను హిందీలో రిలీజ్ చేయికపోయినా కూడా టివిల్లో ఎలాగో హిందీ వర్షన్ తో కుమ్మేస్తారు. అయితే ఇప్పుడు ఈ సినిమాను చైనాకు పంపే యోచనలో ఉన్నారు రామ్ చరణ్‌ అండ్ కో. దంగల్ సినిమా నుండి సీక్రెట్ సూపర్ స్టార్ వరకు.. ఇండియాలో ఎలా ఆడినప్పటికీ.. ఇప్పుడు చైనాలో ఆడిన తీరు మాత్రం అద్భుతం. అందుకే చరణ్‌ కూడా ఎంతో కంటెంట్ అండ్ కనక్టివిటీ ఉన్న తమ సినిమాను చైనీస్ బాషలోకి డబ్ చేసి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

దంగల్ అండ్ రంగస్థలం సినిమాకు ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే.. వీటిల్లో ఉన్న కత సింపుల్ గానే ఉన్నప్పటికీ.. వాటిలోని ఎమోషన్ మాత్రం అద్భుతం. అందుకే అవి యునివర్సల్ గా ఎవ్వరికైనా కనక్టవుతాయి. కాబట్టి ఈ సినిమాతో మనం కూడా చైనా మార్కెట్లో కొల్లగొడితే.. బాహుబలి చైనాలో పెద్దగా ఆడలేదు అనే ఫీలింగ్ నుండి బయటకొచ్చేస్తాం. అది సంగతి.
Tags:    

Similar News