రామ్ చరణ్ హీరోగా సుకుమార్ డైరక్షన్లో వస్తున్న సినిమా 'రంగస్థలం'. ఈ సినిమాలో అసలు మనోడు ఎలా ఉండబోతున్నాడు.. తొలిసారి పూర్తి స్థాయి మాస్ సినిమాను ఈ దర్శకుడు ఎలా తీయబోతున్నాడు అంటూ ఇప్పటివరకు చాలా సందేహాలు ఉన్నాయి. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఇప్పుడు సౌండ్ ఇంజనీర్ చిట్టిబాబుగా మన ముందుకు వచ్చేశాడు రామ్ చరణ్. పదండి ఎలా ఉందో చూద్దాం.
టీజర్లో మొత్తంగా రామ్ చరణ్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో పరిచయం చేశాడు సుకుమార్. సౌండ్ ఇంజనీర్ చిట్టిబాబు పాత్రలో.. మనోడు వినికిడి సమస్యతో బాధపడుతున్న వ్యక్తిగా నటించాడు. బాధ అంటే బాధ కాదు.. మనోడు వినబడకపోయినా.. పెదాలను బట్టి చదివేస్తూ నెట్టుకొచ్చేస్తుంటాడు. ఓవరాల్ గా రామ్ చరణ్ మాస్ లుక్ ఈ సినిమాకు ప్లస్ అయితే.. లుంగీ కట్టుకుని గెడ్డం పెంచుకుని పాత్రలో అతను పరకాయ ప్రవేశం చేసిన తీరు ఆ పాత్రను ఇంకా బాగా రక్తికట్టించింది. అలాగే గోదావరి బ్యాక్ డ్రాప్.. 80ల నాటి లుక్.. సింపుల్ గా పల్లెటూరి వాతావరణం.. సినిమాకు హైప్ తెస్తున్నాయి.
చేతిలో కొడవలి పట్టుకుని రామ్ చరణ్ నడిచొస్తుంటే.. వెనుక ఆ మాస్ మ్యూజిక్ చూస్తుంటే.. సుకుమార్ కూడా బోయపాటిని మించేసే యాక్షన్ సినిమా ఏదో తీశాడనే అనిపిస్తోంది. ఇకపోతే రత్నవేలు ఫోటోగ్రాఫి.. దేవిశ్రీ మ్యూజిక్ ఎప్పటిలాగానే సుకుమార్ కు ప్లస్ అయ్యే ఛాన్సుంది. ఇక ట్రైలర్ వచ్చేవరకు మెగా ఫ్యాన్స్ ఈ టీజర్ తో పండగ చేసుకోవాల్సిందే.
Full View