జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో పెర్ఫార్మన్స్ పరంగా కమర్షియల్ గా టాప్ మూవీస్ లో చోటు దక్కించుకున్న టెంపర్ హిందీ రీమేక్ సింబా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని బాగానే దున్నేస్తోంది. గత వారం షారుఖ్ ఖాన్ మిగిల్చిన పీడకల జీరో తాలూకు జ్ఞాపకాల నుంచి ఉపశమనం పొందడానికి ఇదే బెస్ట్ ఆప్షన్ గా భావిస్తున్నారు. నిజానికి హిందీ వెర్షన్ కు దర్శకుడు రోహిత్ శెట్టి చాలా మార్పులు చేసాడు. మక్కికి మక్కి తీయలేదు. ఓ అమ్మాయి విలన్ తమ్ముళ్ల చేతిలో మానభంగంతో పాటు రేప్ కు గురవుతుంది అన్న పాయింట్ తప్ప మిగిలినదంతా తన స్టైల్ లో మార్చేసుకున్నాడు.
టెంపర్ లో విలన్ కు నలుగురు తమ్ముళ్లు ఉంటే ఇందులో ఇద్దరే ఉంటారు. మన వెర్షన్ లో ప్రకాష్ రాజ్ కు ఫ్యామిలీ ఉండదు. కానీ సింబలో మెయిన్ విలన్ సోను సూద్ కు కుటుంబం ఉంటుంది. వాళ్ళ మీద కీలకమైన సన్నివేశాలు ఉంటాయి. సింబాలో హీరొయిన్ సారా క్యాటరింగ్ సర్వీస్ లో ఉంటుంది. పోసాని పాత్ర చేసిన అశుతోష్ రానాతో హీరో మందు కొట్టే సీన్లు ఉన్నాయి. ఇలా అక్కడి ప్రేక్షకుల టేస్ట్ కు తగ్గట్టు రోహిత్ శెట్టి తన చిత్తానికి ఒరిజినల్ వెర్షన్ కు మార్పులు చేసుకున్నా ఫైనల్ గా మాస్ కు కావాల్సిన అంశాలన్నీ కూర్చడంతో సింబాకు మంచి ఫిగర్లు నమోదవుతున్నాయి.
ఈ ఏడాది సింబా రూపంలో హిట్ తో బాలీవుడ్ క్లోజ్ చేయనుందని ట్రేడ్ టాక్. తారక్ ని ఓన్ చేసుకుని మనం ఇష్టపడిన టెంపర్ తో పోల్చుకుంటే మాత్రం సింబా కాస్త నిరాశ పరిచే అవకాశం ఉంది. అయితే నార్త్ ప్రేక్షకులకు ఒరిజినల్ చూసే ఛాన్స్ లేదు కాబట్టి సింబాలోని మెయిన్ థీమ్ కి బాగానే కనెక్ట్ అవుతున్నట్టు వసూళ్లు చెబుతున్నాయి. ఏదైనా ఇందులో కొంత క్రెడిట్ మాత్రం రచయిత వక్కంతం వంశీ తెలుగు వెర్షన్ దర్శకుడు పూరి జగన్నాధ్ కు ఇవ్వాలని బాలీవుడ్ క్రిటిక్స్ పేర్కొనడం గమనార్హం.
Full View