ఈ మధ్య దేశవ్యాప్తంగా సంచలనం రేపిన షో 'ఏఐబీ రోస్ట్'. కరణ్ జోహార్ ఆధ్వర్యంలో నడిచిన ఈ షోలో బూతు పురాణం గురించి చాలా పెద్ద చర్చే నడిచింది. కరణ్‌తో పాటు రణవీర్ సింగ్, అర్జున్ కపూర్ లాంటి యువ కథానాయకులు మైకు పట్టుకుని పచ్చి బూతు జోకులు వేయడం.. చాలామంది బాలీవుడ్ సెలబ్రెటీలు ప్రేక్షకులుగా మారి.. చప్పట్లతో వారిని ప్రోత్సహించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇలాంటి షోలు యువతను తప్పుదోవ పట్టిస్తాయంటూ సంప్రదాయవాదులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చివరికి అమీర్ ఖాన్ సైతం ఈ షోను తప్పుబట్టాడు. ఇది మంచిది కాదంటూ గట్టిగానే విమర్శించాడు.
ఐతే అమీర్ తమను తిట్టిపోసినప్పటికీ అతనంటే తనకు పిచ్చి అభిమానమే అని అంటున్నాడు రణవీర్ సింగ్. ''అమీర్‌కు మా షో నచ్చి ఉండకపోవచ్చు. ఆయన మమ్మల్ని తిట్టి ఉండొచ్చు. కానీ ఆయన్ని నేనిప్పటికీ ఎంతో ఇష్టపడతా. నా గుండెల్లో ఆయనకు ప్రత్యేక స్థానముంది. ఆయనంటే నాకెంతో గౌరవం. సినిమాల కంటెంట్ విషయంలో ఆయన కొత్త ట్రెండు సృష్టించారు. సమాంతర సినిమాకు, కమర్షియల్ సినిమాకు మధ్య ఉన్న సన్నని గీతను ఆయన పట్టుకున్నారు. ఈ రెండింటినీ కలిపి అద్భుతమైన సినిమాలు తీశారు. లగాన్ దగ్గర్నుంచి పీకే వరకు ఆయన చేసిన సినిమాలు మరెవరికీ సాధ్యం కానివి. రెండు ప్రపంచాల్ని ఒక్కటి చేశారాయన. ఆయనో విప్లవం తెచ్చాడు'' అంటూ అమీర్‌పై తన అభిమానాన్ని చాటుకున్నాడు రణవీర్.